చంద్రబాబు పాలనలో పేదలకు అన్యాయం

దళిత,గిరిజన,బహుజనులకు దిక్సూచి వైయస్‌ఆర్‌

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ పాలనను సువర్ణ అక్షరాలతో లిఖించాలని వైయస్‌ఆర్‌సీపీ వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు.ఆయన అసెంబ్లీ సమావేశాల్లో  మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న దళిత,గిరిజన,బహుజన కుటుంబాలకు వైయస్‌ఆర్‌ దిక్సూచి లాంటి వారని కొనియాడారు.సంక్షేమాన్ని,అభివృద్ధిని రెండు కళ్లుగా ప్రజలకు అందించిన మహానీయుడని తెలిపారు.అంబేద్కర్‌ ఆలోచన విధానంలో పనిచేసిన వ్యక్తి వైయస్‌ఆర్‌ అని అన్నారు.

సాచురేషన్‌ విధానంలో పేదలందరికి అనేక సహాయాలు చేశారన్నారు.విద్యా వ్యవస్థను మెరుగుపరిచి పేదల స్థితిగతులను మార్చిన వ్యక్తి వైయస్‌ఆర్‌గా పేర్కొన్నారు.విద్యార్థులకు 30 శాతం స్కాలర్‌షిప్పులు పెంచిన మహానీయుడు వైయస్‌ఆర్‌ అని తెలిపారు.వైయస్‌ఆర్‌ హయాంలో పేదలకు న్యాయం జరిగిందన్నారు.వైయస్‌ఆర్‌ పేదలకు లక్షల ఎకరాలు పంచారన్నారు.చంద్రబాబు అంబేద్కర్‌ స్మృతివనం కడతామని కట్టలేదన్నారు.చంద్రబాబు హయాంలో ఎస్సీ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందన్నారు.రూ.700 కోట్లు అవినీతి జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top