చంద్రబాబూ.. ఎందుకంత హైరానా

ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశావ్‌..

ఈసీపై ఎందుకంతా ఆక్రోశం

రోజుకో కొత్త నాటకంతో ప్రజాస్వామ్యం ఖూనీ

చంద్రబాబు తీరుతో రాష్ట్రం నష్టపోయింది

ప్రజలు చంద్రబాబును సాగనపుతారు..

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

హైదరాబాద్‌:చంద్రబాబు రోజుకో కొత్తనాటకంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంపై జీవితాంతం తనకే హక్కు ఉన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ హక్కును ఎన్నికల కమిషన్‌ అనే వ్యవస్థ పూర్తిగా దూరం చేసి  రాష్ట్రానికి అన్యాయం చేస్తునట్లుగా చంద్రబాబు రోజుకో విన్యాసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో ఉన్న మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అత్తెసరు ఓట్ల తేడాతో గెలిచారన్నారు.వైయస్‌ఆర్‌సీపీపై కేవలం 5లక్షల ఓట్లు తేడాతో టీడీపీ గెలిచిందన్నారు.

ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన చంద్రబాబు..గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ఎదో జరిగిపోతుందనట్లు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తూ బాబు హైరానా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈసీని హెచ్చరించే ధోరణిలో మాట్లాడుతూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారన్నారన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత నెలరోజులు పాటు సమీక్షలు చేయకపోతే  పోలవరం ఖర్చులు పెరిగిపోతాయని, రాష్ట్రం నష్టపోతుందని.. దానికి ఎలక్షన్‌ కమిషన్‌ బాధ్యత వహించాల్సివుంటుందని చంద్రబాబు లేఖలో పేర్కొనడం ఏ ప్రపంచంలో ఉన్నారో తెలియడం లేదన్నారు. చంద్రబాబు తీరు చూస్తూంటే అశ్చర్యమేస్తుందన్నారు.

నెలరోజులు పాటు పోతూపోతూ మొత్తం దోచుకుపోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు చేసే సమీక్షలతో ప్రజల కొరిగిందేమి లేదన్నారు.బిల్లులు రాబట్టాలని పోలవరంపై రివ్యూలు చేశారన్నారు.డ్రింకింగ్‌ వాటర్‌ ముసుగులో పోలవరంపై రివ్యూలు చేశారన్నారు.రెండోరోజు సిఆర్‌డిఏ మీద సమీక్ష చేశారన్నారని, ఐదేళ్లలో ఒక శాశ్వత భవనం కూడా నిర్మించలేని చంద్రబాబు.. ఈ నెలరోజుల్లో ఎదో చేస్తున్నట్లు హడావుడి చేస్తున్నారన్నారు.అందుల్లో లావాదేవిలు ఉన్నాయి కాబట్టే రివ్యూలు చేస్తున్నారన్నారు.  కేసులు తొలగించుకోవడానికి మూడోదిగా లా అండ్‌ ఆర్డర్‌ మీద దృష్టిపెట్టారని తెలిపారు. వైయస్‌ఆర్‌ హయాంలో 2009 ఎన్నికల్లో పోలింగ్‌కు, ఫలితాల లెక్కింపుకు  23 రోజులు గ్యాప్‌ వచ్చిందని.. ఆ 23 రోజుల్లో వైయస్‌ఆర్‌ ఒక రివ్యూ కూడా చేయలేదని గుర్తుచేశారు.ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఏమీ పనిచేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నిజంగానే పనిచేస్తే పోలవరం ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు.

కనీసం నాలుగు శాశ్వత భవనాలు కూడా నిర్మించలేదన్నారు.రాష్ట్రానికి చంద్రబాబు తీవ్ర నష్టచేశాడని,ప్రజలు కూడా ఆయనను సాగనంపుతారన్నారు. నిజంగా చంద్రబాబు రాష్ట్రం గురించి తపన పడే వ్యక్తే అయితే రేపు రాబోయే తుపాన్‌ను ఎలా ఎదుర్కొవాల్లో   పార్టీ నేతలతో సమీక్షలు జరపవచ్చు కాదా అని ప్రశ్నించారు.అలా చేయకుండా తనను,పార్టీని కాపాడుకోవడానికే చంద్రబాబు ఢిల్లీలో ధర్నాలంటూ పర్యటనలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో తన పార్టీని,కేసుల నుంచి ఎలా తప్పించుకోవాల్లో చంద్రబాబు ఆందోళన చెందుతున్నారన్నారు. చంద్రబాబు తన ఓటమిని ఈవీఎంలపై నెట్టివేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

 

Back to Top