తాడేపల్లి: పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో పొత్తుల్లేని చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు హడావుడి చేశారని ఆయన విమర్శించారు. బీజేపీని తిట్టిన నోటితోనే చంద్రబాబు మళ్లీ పొగుడుతున్నారని మండిపడ్డారు. పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలని, పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదన్నారు.
మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..
పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు...ఆ ధైర్యం చంద్రబాబుకు లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.175 నియోజకవర్గాలలో అభ్యర్దులను నిలిపే సత్తా తెలుగుదేశం పార్టీకి,చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు.అలా పోటీ చేస్తానని ఎందుకు ప్రకటించలేకపోతున్నారో చెప్పాలన్నారు. తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో బుధవారం ఆయన మాట్లాడారు. బిజేపితో పొత్తుకోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని,పూర్తిగా నమ్మకం కోల్పోయి,డీలా పడ్డ టిడిపి కార్యకర్తలను కాపాడుకునేందుకు చంద్రబాబు యధాశక్తి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళే దమ్ము లేదని,గతంలో బిజేపిని,నరేంద్రమోదిని తిట్టిన చంద్రబాబు నేడు అదే నోటితో పొగుడుతున్నారని అన్నారు. చంద్రబాబు గంటకు గంటకు మాటలు మారుస్తుంటాడు...ప్రజలకు జ్ఞాపకం ఉండదనే భావనలో ఉంటాడని అందుకనే తరచూ మాటలు మారుస్తుంటాడని ఎద్దేవా చేశారు.
బిజేపి,జనసేనలు మాతో కలుస్తారని అనుకోవడంలోనే చంద్రబాబు బలహీనత అర్ధమవుతుంది.వాళ్ళు లేందే బతకలేను...వీళ్ళు లేందే బతకలేను....నాతో పలనావాళ్ళు వచ్చి కలిస్తేనే మేలు జరుగుతుంది లేదా 2 ప్లస్ 2 ఫోర్ అవుతుంది లేదో సిక్స్ అవుతుందని చెప్పుకునే చంద్రబాబు బతుకు ఎందుకు అని నేను అడుగుతున్నానని అన్నారు.చంద్రబాబుకు నమ్మకం లేదన్నారు.ఢిల్లీ వెళ్ళి నడ్డాతో వంగి వంగి మాట్లాడుతూ అదే సమయంలో జగన్ గారి గురించి విమర్శించడం అనేది చంద్రబాబు తప్ప మరొకరు చేయలేరని అలా చేయడం అంటే మెంటల్ కేసన్నా అయిఉండాలి లేదా బరితెగింపు తనం అయినా అయిఉండాలన్నారు.ఢిల్లీ వెళ్ళి హడావుడి చేస్తూ ఆంధ్రప్రదేశ్ పరువు చంద్రబాబు తీస్తున్నారని విమర్శించారు. నిజానికి చంద్రబాబు పొత్తులనేవి తనకు అలవాటేనని శ్రీ వైయస్ జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులు ఎవరితోనైనా పెట్టుకుంటామని నిర్లజ్జగా మాట్లాడుతున్నారన్నారు.
నరేంద్రమోదిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు.ఇప్పుడు తిరిగి పొగుడుతున్నారు.ప్రత్యేక హోదాకోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాననని చెబుతున్నాడు. అదేదో దశాభ్దాల క్రితం జరిగిందా కాదుకదా.కొద్ది సంవత్సరాల క్రితం జరిగింది ప్రజలు ఎలా మరిచిపోతారు. బిజేపితో 2018 వరకు ఒకరి ప్రభుత్వంలో మరొకరు మంత్రులుగా ఉన్నారు.చివరిలో పోలవరం ప్రాజెక్టును తెచ్చుకున్నారు.ప్రత్యేక హోదా అక్కర్లేదు ప్యాకేజి చాలని సెలబ్రేషన్స్ జరిపారు. ఇవన్నీ ప్రజలు మరిచిపోరు. నేడు కళ్లార్పకుిండా నేడు తిరిగి అదే అబద్దాలు ఆడుతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ఆదరణ కరవైందన్నారు.పాదయాత్ర సందర్భంగా జనం కరువయ్యారని అంటూ దానిని కవర్ చేసేందుకు చిన్నచిన్నవీధుల్లో ఫ్లెక్సీల మధ్య జనాలను నింపుతూ రెండువేలమంది వస్తే 20 వేల మంది వచ్చారంటూ నానా తంటాలు పడుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీని,మిగిలిన కార్యకర్తలను కాపాడుకునేందుకు చంద్రబాబు,పచ్చమీడియా సహాయంతో చేయని ప్రయత్నం లేదన్నారు. అందుకే ఢిల్లీ వెళ్లి చంద్రబాబుకేదో ఆదరణ ఉందనే ప్రయత్నం చేస్తున్నా అది ప్రజలందరికి తెలిసిపోతోందన్నారు.
పురంధేశ్వరి చంద్రబాబుకు,టిడిపికి ఏజంట్ లాగా మారారు. పురంధేశ్వరి,పవన్ కల్యాణ్ లు బిజేపి,టిడిపి పొత్తుకోసం పైరవీలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇటీవల జోకులు వేయడంలో తనకు ఎవరూ సాటిరారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నిజానికి చంద్రబాబు బఫూన్ కు ఎక్కువ జోకర్ కు తక్కువ అని అన్నారు. వార్ధక్యం వల్ల వచ్చిందా అనుకుందామంటే ఆ స్టేజ్ దాటిపోయారు.ఆయన హావభావాలు,మాటతీరు చూస్తే చంద్రయాన్ గురించి మాట్లాడుతూ దానిలాగా వచ్చేది మేమే అని చంకలు గుద్దుకుంటున్నారని అన్నారు. రాజకీయాలంటే ప్రజలగురించి ఉండాలి.ప్రజల గురించి రాష్ర్ట అభివృధ్ది గురించి మాట్లాడాలి. చంద్రబాబులాంటి వారైతే 2014 నుంచి తాను ఏంచేశాడో చెప్పగలగాలి.అలాగే జగన్ గారు పరిపాలనలో లోపాలు ఉంటే చెప్పవచ్చు. అదంతా అలా ఉంచి ఆ రెండు పత్రికలు ప్రభంజనం అంటూ బాకా ఊదుతున్నాయి. నిజానికి చెప్పాలంటే ప్రభంజనం అంటే 2019 లో జరిగింది.ప్రభంజనం అంటే వైయస్ గారు కొట్టిన దెబ్బ. 2024లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబుకు అడ్రస్ కూడా మిగలదు.అలాంటిది ఆయన గేట్లు తెరిస్తే మా పార్టీ ఎంఎల్ఏలు వస్తారంటూ చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తున్నామని అంటున్నారు.ప్రజలకు చంద్రబాబు,టిడిపిలపై నమ్మకం లేదు.వారు చెప్పే మాటలు నమ్మేస్దితిలో ప్రజలు లేరు. అలాంటి వారు ఎన్నిలెక్కలు వేసుకుంటే ఏమవుతుంది. రెండుపత్రికలలో,టివిలలో బజ్ క్రియేట్ చేసుకోవచ్చు తప్ప వాస్తవంలో చంద్రబాబు చెప్పేది ఏదీ రిఫ్లెక్టు అయ్యే పరిస్దితి లేదు అన్నారు.చంద్రబాబు 175 నియోజకవర్గాలకు ఏమీ చేయగలరో చెప్పాలి.లేదా ఇప్పటివరకు ఏమి చేశారో చెప్పాలి.హడావుడిగా కర్నాటక దానిని కాపీ కొట్టో మరొకటో చేసి అధికారంలోకి రావాలనే తాపత్రయం కనిపిస్తోంది. డెస్పరేటివ్ మూడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్లు ప్రకటిస్తున్న మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించడం లేదు. మహానాడులో సైతం ప్రకటించారు. అవి గుర్తుండే పరిస్దితి కూడా లేదు. జగన్ గారు అమలు చేస్తున్న పధకాల వల్ల రాష్ర్టం శ్రీలంక అవుతందని చెప్పింది వాళ్లే నేడు అవే పధకాలు కొనసాగిస్తామని చెబుతుంది వాళ్లే దీనిని ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందా ఉంటే అది ఎంత చీలుతుంది. జగన్ గారిపైన గాని ప్రభుత్వ పనితీరు పైనగాని పాజిటివ్ ఓటు 70 శాతం పైన ఉన్నప్పుడు నీవు 30 శాతం మీరు ఎంతమంది కలిస్తే ఏమవుతుంది. లేదా ఎన్నికల సమయం వచ్చి మరో పదిశాతం తీసేసినా 60 శాతం ఒకవైపు ఉన్నప్పుడు మీ 40 శాతం అంతా అందరూ కలసి కట్టకట్టుకున్నా కూడా ఏమవుతుంది...ఇది పొగరుగా చెప్పడం లేదు...కాన్ఫిడెన్స్ తో చెబుతున్నానని అన్నారు.ఆయా ఛానల్స్ కు డిబేట్లకు రేటింగ్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరోటి లేదు. నిజానికి వైయస్ జగన్ గారు చేసిన అభివృధ్ది సంక్షేమ కార్యక్రమాల వల్ల వ్యతిరేక ఓటు కాదు పాజిటివ్ ఓటు ఉంది.
చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించారు.అప్పుడు నరేంద్రమోదిగారిని,ఆయన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. మళ్లీ ఈరోజు పొగుడుతున్నారు.అంటే చంద్రబాబు నాడు తిడితే అది నమ్మాలి. నేడు చంద్రబాబు పొగుడుతున్నారు కాబట్టి నరేంద్రమోది గొప్పవాడవుతారు. మీడియా ప్రతినిధులు అడగాలి. ప్రత్యేక హోదా గురించి,నరేంద్రమోది గురించి ఆయన అన్న మాటలను మీడియావారు గుర్తు చేస్తే బాగుంటుంది. అన్నారు. చంద్రబాబు ఏమీ యాత్రలు చేసినా ప్రజలు నమ్మే స్దితి లేదన్నారు.చంద్రబాబుకు ప్రజలు ఆదరిస్తారనే ధైర్యం కూడా లేదన్నారు.
ఎన్టీఆర్ స్మారక నాణెం ప్రోగ్రామ్ కు లక్ష్మీపార్వతిని పిలవకుండా ఎన్టీఆర్ ఆత్మను మరోసారి క్షోభకు గురిచేశారు. ఈ విషయంలో నీచ రాజకీయాలు చేశారు. చంద్రబాబు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు. రాష్ర్టపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారు. రాజకీయాలు ప్రజలకోసం ఉండాలి. ఎన్టీఆర్ ను చంద్రబాబు వీలున్నప్పుడల్లా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ ఆత్మఘెష పెడుతూ ఉంటుంది. ఎన్నివేల సార్లు వెన్నుపోటు పొడిచి ఉంటాడో తెలియడం లేదు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కు భార్య. అలా కాదని చంద్రబాబు,లేదా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు భావిస్తుంటే అది ప్రజలకు చెప్పాలి. ఎన్టీఆర్ వివాహం చేసుకున్న విషయాన్ని కూడా కాదని చెబుతూ ఆమె నీ భార్య కాదని చెబుతున్నారంటే వారు ఎంత దిగజారుడుగా ప్రవర్తిస్తున్నారో అర్దం చేసుకోవచ్చు అన్నారు.మరుగుజ్జు లాంటి చంద్రబాబు శిఖరం లాంటి ఎన్టీఆర్ ను ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకుంటున్నారని అన్నాారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీఆర్ కుమారులు చంద్రబాబు చేతిలో పావుగా ఉంటున్నారని అన్నారు.
చంద్రబాబు భావజాలం అంటే రాష్ర్టాన్ని నాశనం చేయడమే.వేల కోట్ల రూపాయలు దోచుకోవడం.తన వర్గాన్ని పైకి తేవాలని చూడటం ఇలాంటి వాటిని సమర్ధించేవారు చంద్రబాబుకు జత కడితే మాకు అభ్యంతరం లేదు.పవన్ కల్యాణ్ 2014 లో బయట ఉండి సపోర్ట్ చేసినా,2019లో విడిగా పోటీచేసినా రేపు కలిసి పోటీచేసినా కర్త,కర్మ,క్రియ డైరక్షన్ చంద్రబాబే అనేది అందరికి తెలిసిందే.చంద్రబాబు సపోర్టే చేసే వారి లక్ష్యం ఒక్కటే తిరిగి ఆయనను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలనేదే.ఇందుకు అవసరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబుకు ప్రజల విశ్వాసం అనేది లేదనే వాస్తవం అందరూ గుర్తిస్తే మంచిది అన్నారు. చంద్రబాబు దోపిడీలకు పాల్పడి వ్యవస్ధలను నాశనం చేస్తే పారదర్శకతకు,అవినీతి రహిత పాలనను అందిస్తోంది వైయస్ జగన్ గారు అన్నారు.వికేంద్రీకరణ తీసుకువచ్చి ప్రజల డోర్ స్టెప్ వద్దకు పాలనను అందిస్తున్నారన్నారు. కాబట్టి ప్రజల మధ్దతు వైయస్ జగన్ గారికే ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.