పేద‌ల గురించి చంద్ర‌బాబు ఏనాడూ ప‌ట్టించుకోలేదు

అందుకే ప్ర‌జ‌లు త‌రిమి కొట్టారు

ట్విట‌ర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

విజయవాడ-సింగపూర్‌ మధ్య వారానికి 2 ఫ్లయిట్లు నడిపినందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు నెలకు రూ.3 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ చంద్ర‌బాబు  ముట్టజెప్పార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట‌ర్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీకి రూపాయి ఇవ్వడానికి చేతులు రాలేదు. పేదల ప్రయాణ సౌకర్యాల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ప్రజలు తరిమికొట్టార‌ని ట్విట్ చేశారు.

మ‌రుగుదొడ్లు  నిధుల‌ను మింగేశారు...
పేద కుటుంబాలకు మరుగు దొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను మీ పార్టీ నేతలు మింగేశారు. మీ నివాసం, మంత్రుల ఇళ్లలో ఒక్కో టాయిలెట్ రెనోవేషన్ పనులకు 7 నుంచి 9 లక్షలు ఖర్చు చేసినట్టు బిల్లులు సృష్టించారు. చివరకు దొడ్లను కూడా వదిలి పెట్టలేదు కదా చంద్రబాబు గారూ?  అంటూ ట్విట‌ర్‌లో ప్ర‌శ్నించారు.

కిరాయి మనుషులతో ఓదార్పులు పొందడం ఎబ్బెట్టుగా ఉంది..
మిమ్మల్ని, మీ ప్యాకేజీ పార్టీలను చిత్తుగా ఓడించి జగన్‌ గారికి  ప్రజలు పట్టం కట్టారు. మీరేదో అన్యాయంగా ఓడిపోయినట్లు కిరాయి మనుషులతో ఓదార్పులు పొందడం ఎబ్బెట్టుగా ఉంది. మీ ఆస్థాన డైరెక్టర్లు చాలామంది ఉన్నారుగా. సానుభూతి కోసం కొత్త ఐడియాలు తీసుకోండి చంద్రబాబు గారూ అంటూ ట్విట్ చేశారు.
 

Back to Top