చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు

ఏపీలో ప్రజాస్వామ్యం అభాసుపాలు

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ.లక్షల కోట్లు దోచుకున్నారు.

ఏపీలో  దోపిడీ పరాకాష్టకు చేరుకుంది

ప్రజాధనం దోచుకుతిన్న వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదు..

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం:ఏపీలో ఈ ఐదేళ్లలో జరిగినన్ని దారుణాలు ఎప్పూడు జరగలేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.విశాఖపట్నంలో వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.2014 నుంచి ఇప్పటివరుకు మాజీ సీఎస్‌లు మాటలు వింటుంటే ప్రజాస్వామ్యం ఎంతగా అభాసుపాలైందో అర్ధమవుతోందన్నారు.మాజీ సీఎస్‌లు ఐవైఆర్,అజయ్‌కల్లాంలు టీడీపీ ప్రభుత్వం అవినీతిని కళ్లకు కట్టినట్లు పలు సందర్భాల్లో,వేదికల్లో  వివరించారన్నారు.మాజీ సీఎఎస్‌లు ఐవైఆర్,అజయ్‌కల్లాం వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుకు ధైర్యముంటే వీటిపై విచారణకు సిద్ధపడాలని డిమాండ్‌ చేశారు. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై యనమల వ్యాఖ్యలు బాధాకరమన్నారు.

అధికారులను కేబినెట్‌ నిర్ణయాలకు వత్తాసు పలికాలని యనమల  వ్యాఖ్య‌లు రాజ్యాంగాన్ని ఎంతగా అపహాస్యం పాలు చేస్తున్నారో అర్ధమవుతుందన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీకి డబ్బు సంచులను çసర్ధినవారికి,విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన వారికి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ధనాన్ని దోచుపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర ఎందుకు సెలవుపై వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ,అడ్డగోలు పనులు చూడలేక ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర సెలవుపై వెళ్ళారన్నారు. అడ్డగోలుగా టీడీపీ ప్రభుత్వానికి సహకరించవద్దని అ«ధికారులకు విజ్ఞప్తి చేశారు. నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.రాబోయే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో  తప్పకుండా టీడీపీ అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతుందన్నారు.దోపిడీదారులకు ప్రజా కోర్టు ముందు  నిలబడక తప్పదన్నారు. వందల మంది..500 కోట్ల రూపాయలు లెక్కన కాంట్రాక్టర్ల రూపంలో ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు.

బడ్జెట్‌లో శాంక్షన్‌  లేకుండా సుమారు 60వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చుచేశారని మాజీ సీఎస్‌ ఐవి కృష్ణారావు తెలిపారని గుర్తుచేశారు. ఓటుకు నోటుకు కేసులో చంద్రబాబు పటుబడిన  రోజు నుంచి విభజన చట్టంలో అంశాల  ఫైల్‌ పంపిస్తే అవి ముఖ్యమంత్రి దగ్గరే ఉండిపోతున్నాయని ఆయన బహిరంగంగా తెలిపారన్నారు.ఏపీని  నష్టపర్చింది చంద్రబాబు కాదా..అని ప్రశ్నించారు. కేబినెట్‌ నిబంధనలు ఏమిటి..పలాన వ్యక్తిని బిల్లు ఇవ్వమని కేబినెట్‌ చెబుతుందా..అంటూ యనమల రామకృష్ణుడ్ని ప్రశ్నించారు.  పాలసీ మేటర్‌ ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు.ఆ పాలసీ మేటర్‌ను అధికార  కార్యదర్శులు  పర్యవేక్షణలో అమలు జరుపుతారన్నారు.  ప్రజలను మభ్య పెట్టి మేం చేసిందే కరెక్ట్‌ అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు.. కాంట్రాక్టులు మొత్తం ఆయన సామాజికవర్గానికే  కట్టబెట్టారన్నారు.ఎకరా రూ.40 కోట్లు విలువైన భూములను రూ.30 లక్షలకే ఇచ్చారన్నారు.హుద్‌హుద్‌ తుపాను పేరుతో భూములను దోచుకుతిన్నారన్నారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనం దోచుకుతిన్న వారికి శిక్ష తప్పదన్నారు.రాష్ట్రంలో ఎన్నికలు అయినతర్వాత  ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు.శాంతి భద్రతలు చిన్నాభిన్నం అయిపోయాయని తెలిపారు.

 

తాజా వీడియోలు

Back to Top