వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌లు మెచ్చిన నాయ‌కుడు

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

తిరుపతి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలు మెచ్చిన నాయకుడని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఫల్యాలే తమ గెలుపుకు కారణం అవుతాయన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘన చేస్తోందన్నారు. ఎన్నికల అధికారులు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారని చెప్పారు. వైయ‌స్‌ జగన్ జనం మెచ్చిన నాయకుడు కాబట్టే.. 175 స్థానాలకు అభ్యర్థులను ఒకే సారి ప్రకటించారని పేర్కొన్నారు.

చంద్రబాబుకు వారి పార్టీలోని వారిపైనే నమ్మకం‌లేదని, అందువల్లే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైయ‌స్‌ జగన్‌ మాటని, ప్రాణాన్ని ఒక్కటిగా భావిస్తారన్నారు. చంద్రగిరిలో నీటి కష్టాలు తీర్చడమే తమ ‌లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే చంద్రగిరి ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఈ నెల‌ 25న మద్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య నామినేషన్ వేస్తానని వెల్లడించారు.

 

Back to Top