పంటబీమా గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదు

వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి 
 

నెల్లూరు: పంటబీమా గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న రైతు సంక్షేమంపై టీడీపీ అధినేత చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నారని  ఆయ‌న‌ మండిపడ్డారు. రైతుల హృదయాల్లో వైయస్సార్ నిలిచిపోయారని... అందుకే వైయస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించామని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయకుండా చంద్రబాబు దగా చేశారని విమర్శించారు.  సీఎం వైయ‌స్ జగన్ మాత్రం రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని అన్నారు.

రైతులకు పంటబీమా ఇవ్వలేక గత టీడీపీ ప్రభుత్వం చతికిలపడితే... పంట దిగుబడి తగ్గినా బీమా వచ్చేలా జగన్ చర్యలు తీసుకున్నారని కాకాణి కొనియాడారు.  మిల్లర్లతో చేతులు కలిపి రైతులను టీడీపీ నేతలు ముంచేశారని చెప్పారు. రైతులను మోసం చేసిన చరిత్ర టీడీపీదని, వైసీపీ ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేయడాన్ని ఇకనైనా మానుకోవాలని ఎమ్మెల్యే హిత‌వు ప‌లికారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top