చంద్రబాబు బీసీ వ్యతిరేకి

హిందూపురం పార్లమెంట్‌ వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌

అనంతపురం: చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని, హిందూపురంలో గెలుస్తానని కుట్రలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ అన్నారు. మూడు నెలల కిందట ఉద్యోగానికి వీఆర్‌ఎస్‌ ఇచ్చినా ఆమోదించలేదని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కర్నూలు డీఐజీలు చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. హిందూపురం లోక్‌సభ స్థానానికి తాను, తన  భార్య నామినేషన్‌ వేయనున్నట్లు గోరంట్ల మాధవ్‌ చెప్పారు. తాను హిందూపురంలో గెలుస్తాననే చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 

 

Back to Top