చంద్ర‌బాబువి దివాళాకోరు రాజ‌కీయాలు

నా అభ్యర్థిత్వాని నాశ‌నం చేయాల‌నుకున్నారు..

టీడీపీ కుట్ర‌ల‌పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తా

వైయ‌స్ఆర్‌సీపీ హిందూపురం అభ్య‌ర్థి గోర్లంట మాధ‌వ్‌..

అమ‌రావ‌తి: బడుగు,బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినైనా నాకు వైయస్‌ జగన్‌ ఎంపీ టికెట్‌ కేటాయిస్తే.. చంద్రబాబు..వ్యవస్థను ఉపయోగించి  నా అభ్యర్థిత్వాన్ని నాశనం చేయాలని చూశారని వైయస్‌ఆర్‌సీపీ హిందూపురం అభ్యర్థి గోర్లంట మాధవ్‌ మండిపడ్డారు. చంద్రబాబు దివాళాకోరు రాజకీయాలకు కోర్టు బాగా బుద్ధి చెప్పిందన్నారు.చంద్రబాబుకు బడుగు,బలహీనవర్గాల పట్ల ఎలాంటి  ప్రేమ  ఉందో బీసీ, ఎస్సీ,ఎస్టీ సోదరులంతా గమనించాలన్నారు. ఏబీ వెంకటేశ్వరావు,కర్నూలు డీఐజిని ఉసిగొల్పి రకరకాల కేసులు బనాయించారన్నారు.చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు నా మీద కుట్ర చేసి పోలీసు అధికారులతో నాపై కేసులు ఉన్నాయని కోర్టులో వేయడం జరిగిందని,కొట్టివేసిన కేసులను కోర్టుకు సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
 టీడీపీ ఆశ‌ల‌పై ట్రిబ్యున‌ల్ నీళ్లు..
 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ ఆశలపై ట్రిబ్యునల్‌ నీళ్లు చల్లింది. తక్షణమే మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్‌ఎస్‌ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. దీంతో ఆయన నామినేషన్‌ వేసేందుకు మార్గం సుగ‌మం  అయింది. ఈ క్రమంలో ఆయన నామినేషన్‌ దాఖలు చేసేందుకు అవకాశం లభించింది. కాగా బీసీలకు పెద్దపీట వేసేందుకు వైఎస్సార్‌ సీపీ ఏడు లోక్‌సభ స్థానాలు వారికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్‌ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. రాజకీయాల్లో చేరే క్రమంలో రెండు నెలల క్రితమే ఆయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది.

Back to Top