చంద్రబాబు అరాచకవాది

చంద్రబాబుకు ఓటేస్తే.. హత్య రాజకీయాలకు ఓటేసినట్లే..

ప్రజలను అన్నిరకాలుగా మోసం చేశాడు..

గ్లోబెల్‌కు వారసుడు చంద్రబాబు..

టీడీపీ పాలనలో వ్యవస్థలు నాశనం

చంద్రబాబు సీఎం కాదు..క్రిమినల్‌ మినిస్టర్‌

మా చిన్నాన్నను చంపింది చంద్రబాబే..

సిబిఐ,ఈడి దర్యాప్తు అంటే భయమెందుకు..?

పలమనేరు ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని..చంద్రబాబు అరాచకవాది అని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పలమనేరు ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన మీరంతా చూశారు. గత ఎన్నికల సమయంలో ఆయన ఏమి చెప్పాడు.ముఖ్యమంత్రి అయినా తర్వాత ఎలా మోసం చేశాడనే విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబు అన్ని రకాలుగా అన్యాయం,దుర్మార్గాలు,మోసాలు చేశాడు. ఒక సినిమాలో విలన్‌ పాత్రలో వ్యక్తి చేసే  పనులన్ని చేశాడు. లేనిది ఉన్నట్లుగా,ఉన్నది లేనట్లుగా చెప్పడంలో చంద్రబాబుకు మించిన వారు ఎవరూ ఉండరు. గ్లోబల్‌కు వారసుడు చంద్రబాబు. చంద్రబాబు వంటి  అన్యాయస్తుడు  ప్రపంచంలో ఎవరూ ఉండరు. చంద్రబాబు నైజాన్ని ఒకసారి గమనించాలి.

సొంత కూతురును ఇచ్చిన  మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పోడిచి..అధికారంలోంచి దించేసి..చంపేసి..అవసరం వచ్చినప్పుడు అదే వ్యక్తి ఎన్టీ రామారావుకు దండ వేసి దణ్ణం పెడతాడు. అన్యాయాలు,మోసాలు ఇవే చంద్రబాబు దగ్గర ఉండేవి. చంద్రబాబుకు ఎవరైనా అడ్డువస్తే  ఆ వ్యక్తిని చంద్రబాబు ఏమి చేయడానికైనా వెనుకాడడు. చంద్రబాబు అధికారానికి ఎవరు అడ్డువచ్చిన వదిలిపెట్టడు.అధికారానికి అడ్డు వస్తున్నాడంటే ప్రధానిని కూడా వదిలిపెట్టడు. చంద్రబాబును మించిన  మాయావి ఇంకెవరూ ఉండరు. ఒక మాఫియా సామ్రాజ్యాన్ని చంద్రబాబు నడుపుతున్నాడు. వ్యవస్థలను నాశనం చేస్తూ దుర్వినియోగం చేస్తున్నాడు. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే హత్య రాజకీయాలకు ఓటు వేయడమే. మాఫియా సామ్రాజ్యానికి ఓటు వేయడమే అని చెబుతున్నా. గ్రామాల్లో సర్పంచ్‌లకు బలం లేదు.విలువ లేదు.జెడ్పీటీలు,ఎంపీటీలకు విలువ లేదు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతున్నాయి, రాష్ట్ర మంతాట చంద్రబాబు మాఫియాను తయారుచేశాడు. సీఎం అనే రెండు అక్షరాలకు చంద్రబాబు పాలనలో  అర్థం ఏమిటంటే సీఎం అంటే క్రిమినల్‌ మినిస్టర్‌గా చెలామణి అవుతున్నాడు. మా చిన్నాన్న  వైయస్‌ వివేకానందరెడ్డి నేను పోగొట్టుకున్నా.. ఆయనను చంపించింది చంద్రబాబు..చంద్రబాబు ఎలా చెప్పితే అలా విచారణ చేసింది వీరి  పోలీసులే.వీళ్లు చెప్పిందే..వీరి పచ్చమీడియా రాస్తుంది..చూపెడుతుంది. న్యాయం ఎలా జరుగుతుందో చెప్పండి.

చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే..హత్య నువ్వు చేయించకపోతే సీబీఐ విచారణ ఎందుకు చేయించలేకపోతున్నావు అని ప్రశ్నిస్తున్నా.. చంద్రబాబు చేస్తున్న పని ఏమిటంటే మనిషిని పొగొట్టుకుంది మేము,చనిపోయింది మా చిన్నాన్న..కాని ఇవాళ నేరారోపణలను మా కుటుంబంపై చేస్తున్నారు. ఇంతకన్నా దిక్కుమాలిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని అడుగుతున్నా. రోజుకో కొత్తకథ..టీవీల్లో ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఎలా చెప్పింతే అలా పోలీస్‌ అధికారులు విచారణ చేస్తున్నారు.ఈనాడు,ఆంధ్రజ్యోతి,టివి 5 ఇలా అమ్ముడుపోయిన ఛానెల్స్,పేపర్లు వక్రికరించి చూపిస్తున్నారు. చంద్రబాబు  నేరగాడు  కాకపోతే సిబిఐ.ఈడి,ఐటి...చివరికి తెలంగాణ కానిస్టేబుల్‌ అంటే ఎందుకు భయపడుతున్నాడు. నేరగాడికి కాకపోతే ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థలో మీ మనుషులను పెట్టుకుని ఎందుకు మేనేజ్‌ చేస్తున్నావని ప్రశ్నిస్తున్నా. నేరగాడివి కాకపోతే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి హైదరాబాద్‌ నుంచి ఎందుకు పారిపోయావు అని ప్రశ్నిస్తున్నా. నువ్వు నేరగాడికి కాకపోతే నీ మీద వేసిన ప్రతి పిటిషన్‌ మీద స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నావు అని అడుగుతున్నా..చంద్రబాబు గురించి సొంత కూతురును ఇచ్చిన మామ ఎన్టీఆర్‌ ఏమన్నారంటే.. చంద్రబాబుకు మించిన దుర్మార్గుడు,నీచుడు ఎవరూ లేరని అన్నారు.చంద్రబాబు పాలనలో లా అండ్‌ అర్డర్‌ పరిస్థితి దారుణంగా ఉంది.పట్టపగలు రితేశ్వరి అనే విద్యార్థి చదువుకోవడానికి వెళ్ళి దారుణంగా చనిపోయింది. అటువంటి దారుణమైన సంఘటన జరిగితే దానికి కారణమైన బాబూరావు అనే వ్యక్తి చంద్రబాబుకు చెందిన వ్యక్తి కావడంతో   కనీసం అరెస్ట్‌ చేయడానికి కూడా  మనసు రాలేదు.

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని మహిళ ఎమ్మార్వో వనజాక్షి అడ్డు తగిలిందే..ఎమ్మెల్యే చింతమనేని ఆమెను జుట్టు పట్టుకుని కొట్టితే..సిగ్గులేకుండా అదే ఎమ్మెల్యేకు మళ్ళీ టిక్కెట్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే తప్పు చేశాడని కోర్టు తీర్పు నిచ్చిన అమలు చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది.చంద్రబాబు అరాచకావాది,హింస వాది కాబట్టే..విజయవాడలో అప్పులు కట్టలేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపడుచులపై కాల్‌మనీ సెక్స్‌రాకెట్లు నడిపిన మానవ మృగాలను ఏమాత్రం అరెస్ట్‌ చేయలేదు. వారు కాలర్‌ ఎగరేసుకుని తిరుగుతున్నారు. అదే కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ గురించి మా ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావిస్తే..రోజామ్మను సస్పెండ్‌ చేసిన పరిస్థితి లేదా అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబ  రాజధానిలో  బలవంతంగా రైతుల నుంచి  భూములను లాక్కుంటూ ఆ భూములను తగలుపెట్టించారు. అటువంటి దారుణాలు చేసి.. దళితులపై దొంగకేసులు పెట్టారు. 2014 ఎన్నికల్లో మాకిచ్చిన మాటను నిలబెట్టుకోండి అని అడిగిన కాపులను,నాయీబ్రాహ్మణులను,మత్స్యకారులను,ముస్లింలను,అంగన్‌వాడీలను,కాంట్రాక్ట్‌ కార్మికులను,అగ్రిగోల్డ్‌ కార్మికులను కొట్టించి.. కేసులు పెట్టి వేధింపులకు గురిచేసింది చంద్రబాబు కాదా అని అడుగుతున్నా.మా ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకులపాడు నారాయణ రెడ్డిని అతిదారుణంగా నరికించలేదా అని అడుగుతున్నా.

అనంతపురం జిల్లాలో రాప్తాడులో భూమిరెడ్డి ప్రసాద్‌ రెడ్డిని ఎమ్మార్వో ఆఫీస్‌లో చంపేసిన పరిస్థితి మీ ప్రభుత్వంలో జరగలేదా అని అడుగుతున్నా. గవర్నమెంట్‌ కార్యాలయంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని దారుణంగా నరికి చంపివేసిన ఘటన చంద్రబాబు హయాంలో జరగలేదా అని అడుగుతున్నా..వైయస్‌ఆర్‌సీపీ నాయకులను,కార్యకర్తలను కిరాతకంగా చంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. విజయవాడలో వంగవీటి రంగ,రాఘవే్రందరావు,పింగళి దశరామ్‌లు చంద్రబాబు హయాంలోనే చనిపోయారు కాదా అని అడుగుతున్నా..ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా లా అండ్‌ ఆర్డర్‌ బతుకుతుందా అని ప్రశ్నిస్తున్నా..అన్యాయమైన పాలన సాగుతుంది.ఎన్నికల వచ్చేసరికి రోజుకో సినిమా, రోజుకో డ్రామా, కథలు అల్లుతారు.నేడు ధర్మం,.అ«ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. మనం చంద్రబాబు ఒకరితోనే యుద్ధం చేయడంలేదు. ఈనాడుతో పారాటం చేస్తున్నాం.ఆంధ్రజ్యోతితో పోరాటం చేస్తున్నాం,టివి5తో పోరాటం చేస్తున్నాం. అమ్ముడుపోయిన మీడియాతో మనం పోరాటం చేస్తున్నాం. ఎన్నికల దగ్గరకొచ్చేసరికి ఈ పెద్దమనిషి చేయని మోసం, చెప్పని అబద్ధం,చేయని నేరం ఉండదు. 

ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి మూటలు,మూటలు డబ్బులు పంపిస్తాడు.గ్రామాల్లోకి ఆ డబ్బు చేరుతుంది. ఆ డబ్బుతో ఈ పెద్దమనిషి చంద్రబాబు మూడువేల రూపాయలు చేతిలో పెట్టి మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు.మమ్మల్ని అందరి ఒకటే కోరుతున్నా.మీ గ్రామాల్లో ప్రతి అక్క,చెల్లెమ్మ,అవ్వ,తాత,అన్నకు చెప్పండి..చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దని చెప్పండి.ఇరవై రోజులు ఒప్పిక పట్టండి..అన్న ముఖ్యమంత్రి అవుతాడు..మన అందరికి ప్రభుత్వం వస్తుందని చెప్పండి.అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు. అన్న సంవత్సరానికి 15 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి..గ్రామంలో ప్రతి అన్నకు చెప్పండి..ఈ రోజు మన పిల్లలను చదివించే పరిస్థితుల్లో ఉన్నామా అని అడగండి..మన పిల్లలు ఇంజనీరింగ్,డాక్టర్లు కావాలన్నా, పెద్ద చదువులు చదవాలన్నా,మన ఆస్తులను అమ్ముకుంటే తప్ప మన చదివించే పరిస్థితుల్లో లేమని చెప్పండి.ఈ పరిస్థితి మారాలంటే దేవుడు ఆశ్వీరందించి రేపు మన అందరి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పండి..అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్‌గానో,డాక్టర్‌గానో, కలెక్టర్‌గానో ఏ చదువులయినా పర్వాలేదు..అన్న చదవిస్తాడు అక్కా అని చెప్పండి.ఉచితంగా అని చెప్పండి.

ప్రతి ఇంట్లో చెప్పండి.45 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కాకు చెప్పండి.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలుగా ఉంటూ, పేదరికంతో అలమటిస్తున్నా ప్రతి అక్కకు చెప్పండి..చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోవద్దు అక్కా..రేపు 20 రోజుల్లో మన అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం అక్కా..అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చేతిలోనూ వైయస్‌ఆర్‌ భరోసా పథకం ద్వారా నాలుగు దఫాలుగా  75వేల రూపాయలు పెడతాడు అని చెప్పండి.పొదుపు సంఘాలలో ఉన్నాం. ఐదు సంవత్సరాలు చంద్రబాబు ఓటేసి చూశాం. రుణమాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పరిస్థితి చూశాం.రుణాలు చూస్తే వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయిన పరిస్థితి చూశాం..అని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దు అక్క.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం..అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాలతో ఉన్న అక్కాచెల్లెమ్మలకు ఎన్నికల నాటికి ఎంత ఉంటే అంతా రుణం ఉంటుందో మొత్తం రుణమంతా నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతుల్లో పెడతాడు అని చెప్పండి.మళ్లీ అన్న ముఖ్యమంత్రి కావాలి.మళ్లీ సున్నా వడ్డీకే రుణాలిచ్చే పరిస్థితి వస్తుందని చెప్పండి.

గతంలో దివంగత నేత, ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో చూశాం.మళ్లీ అదే రాజన్న రాజ్యం ఆయన కొడుకు జగనన్న రాజ్యంలో చూస్తామని చెప్పండి.మళ్లీ సున్నా వడ్డీ తెచ్చి లక్షాధికారులను చేస్తారు అని చెప్పండి.  ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలన చూశాం. రుణమాఫీ అన్నాడు..మోసం చేశాడు.అన్నిరకాలుగా రైతన్నల నడ్డివిడిచాడు.20 రోజులు ఓపిక పట్టండి.అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం..అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్న పెట్టుబడి కోసం ఎక్కడకు పోవాల్సిన పనిలేదన్నా..ప్రతి రైతన్నకు 12,500 చేతిలో పెడతారని చెప్పండి.అక్షరాల యాభై వేల రూపాయలు జగనన్న ప్రతి రైతన్న చేతులో పెడతాడు అనిచెప్పండి.గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి చూశాం. అన్నకు ఒకసారి అవకాశం ఇద్దాం.. గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు.ధాన్యానికి బోనస్‌ కూడా ఇచ్చే రోజులు తెచ్చుకుందాం అని ప్రతి రైతుకు చెప్పండి.చంద్రబాబు ఇచ్చే మోసానికి మోసపొవద్దని ప్రతి  అవ్వకు,తాతకు చెప్పండి.

అవ్వ,తాతా..మూడు నెలల కిందట పింఛన్‌ ఎంత వచ్చేది అని అడగండి.అవ్వ,తాత నోటిలోంచి వచ్చే మాట.చంద్రబాబు హయాంలో రావడం లేదు అని అంటారు. లేకపోతే ఇచ్చేది వెయ్యి రూపాయలు అని చెబుతారు. ఎన్నికల మూడు నెలలు ఉన్నాయన్నగా..చంద్రబాబు పెన్షన్‌ను పెంచినట్లు ఫోజులు కొడుతున్నాడు. ఆ పెన్షన్‌ ఎందుకు పెంచాడో నీకు తెలుసా..అని అడగండి. ఇదే పెన్షన్‌ జగనన్న చెప్పకపోయి ఉంటే పెరిగేందా అని అడగండి.ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెన్షన్‌ పెంచాడు..అన్న చెప్పాడు కాబట్టి పెన్షన్‌ పెరిగింది అని చెప్పండి. చంద్రబాబు మాటలను నమ్మొదండి..ఐదు సంవత్సరాల కాలంలో పట్టించుకోని వ్యక్తి, ఎన్నికలు వచ్చేసరికి కపట ప్రేమ చూపిస్తున్నాడని అవ్వకు,తాతకు చెప్పండి.అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. పెన్షన్‌ను మూడువేల నుంచి పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పండి

Back to Top