చంద్రబాబుది దొంగ దీక్ష

ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు ఎవరిచ్చారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

తూర్పుగోదావరి: ప్రజల డబ్బును దుర్వినియోగం చేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో చంద్రబాబు చేసేది దొంగ అని, ఎన్నికలు సమీపిస్తున్నాయని డ్రామాలు ఆడుతున్నాడన్నారు. తనను తాను మహాత్మాగాంధీతో పోల్చుకోవడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం మొదటి నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

హోదా అంటే పీడియాక్ట్‌లు నమోదు చేస్తామని బెదిరింపులకు గురిచేశారని, పలువురిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సంజీవనా..? హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని మాట్లాడిన చంద్రబాబు హోదా కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు దొంగ దీక్షను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 

 

Back to Top