జనసేన పార్టీ చంద్రబాబు మానస పుత్రిక

చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్‌ యాక్షన్‌..

చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొడతారు..

వైయస్‌ఆర్‌సీపీ రేపల్లె అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ 

గుంటూరు: జనసేన పార్టీ చంద్రబాబు మానస పుత్రిక అని వైయస్‌ఆర్‌సీపీ రేపల్లె అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ అన్నారు.టీడీపీ పాల‌న‌లో ఐదేళ్లలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కనిపించలేదన్నారు.ప్రజలంతా రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.సీట్ల సర్దుబాటులోనే టీడీపీ,జ‌న‌సేనల‌ లోపాయికారి ఒప్పందం బయటపడిందన్నారు.చంద్రబాబు డైరెక్షన్‌లోనే జనసేన నడుస్తుందన్నారు.చంద్రబాబు పాలనలో అవినీతి,అక్రమాలకు ప్రజలు విసిగి వేసారిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.సంక్షేమ ప్రతిఫలాలు ప్రజలకు అందాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు.చంద్రబాబు డైరెక్షన్‌లో జనసేన పార్టీని స్థాపించడం జరిగిందన్నారు.చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొడతారన్నారు.

 

Back to Top