అట్టహాసంగా వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

11 మంది సభ్యులతో ప్రమాణం చేయించిన శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు

ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు

సచివాలయం: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన 11 మంది వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీలతో శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ప్రమాణస్వీకారం చేయించారు. శాసనమండలి చైర్మన్‌ ఆఫీస్‌ ప్రాంగణంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. 

8 జిల్లాల నుంచి 11 స్థానాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు క్లీన్‌స్వీప్‌ చేశారు. విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు (క్షత్రియ, ఓసీ), విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి (కొప్పుల వెలమ, బీసీ), వంశీకృష్ణయాదవ్‌ (యాదవ్, బీసీ), తూర్పుగోదావరి నుంచి అనంత ఉదయభాస్కర్‌ (కాపు, ఓసీ), కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం (కమ్మ, ఓసీ), మొండితోక అరుణ్‌కుమార్‌ (మాదిగ, ఎస్సీ), గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (కాపు, ఓసీ), మూరుగుడు హనుమంతరావు (చేనేత, బీసీ), ప్రకాశం నుంచి తూమాటి మాధవరావు (కమ్మ, ఓసీ), చిత్తూరు నుంచి వైయస్‌ఆర్‌ సీపీ కుప్పం ఇన్‌చార్జ్‌ భరత్‌ (వన్యకుల క్షత్రీయులు, బీసీ), అనంతపురం వై.శివరామిరెడ్డి (రెడ్డి, ఓసీ) శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరితో శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ప్రమాణస్వీకారం చేయించారు. 

 

Back to Top