సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు

తాడేపల్లి: కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయ‌స్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులను సీఎం వైయ‌స్ జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి సన్మానించారు. అలాగే కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

 

Back to Top