సినీ హీరో భాను చంద‌ర్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

 శ్రీకాకుళం : స‌ంక‌ల్ప‌ యోథుడు జగన్‌మోహన్‌ రెడ్డి మోగించిన యాత్రాభేరి నలుదిశలా ప్రతిధ్వనిస్తూ వంచకుల హృదయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన తలపెట్టిన సంకల్పం ఎన్ని అవరోధాలెదురైనా వెనుతీయని ఉత్తుంగ తరంగంలా ముందుకు ఉరుకుతూ పతాక స్థాయికి చేరింది. ప్రజాసంకల్ప యాత్ర గురి తప్పని శరంలా.. జనం నోటి జానపదంలా మున్ముందుకే సాగుతోంది. అలుపెరగని పథికుడి ఆత్మస్థైర్యం మరెందరో జనహితాభిలాషులను దగ్గర చేరుస్తోంది. ఆయన అడుగులో అడుగు వేసి ప్రజాసేవలో పాలుపంచుకోవడానికి వీలుగా వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వివిధ రంగాల ప్రముఖుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది.

ఈ పరిణామం పచ్చదళం గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. పైకెంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. ఈ ఆదరణ టీడీపీని హడలెత్తిస్తోంది. తాజాగా సినీ హీరో భాను చంద‌ర్ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. పార్టీలో ఇప్ప‌టికే సినీ న‌టులు రోజా క్రియాశీలంగా ఉన్నారు. ఇంకా అనేక మంది న‌టులు పార్టీలో ఉన్నారు. పాద‌యాత్ర‌లో సినీ రంగానికి చెందిన కృష్ణుడు,  ప్వ‌ధ్వీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ఇలా అనేక మంది జ‌న‌నేత‌కు సంఘీభావం తెలిపారు.  

 

Back to Top