పండ‌గ‌లా వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవం

పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఎగరవేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల

మహానేతకు నివాళులర్పించి.. భారీ కేక్‌కట్‌ చేసిన మంత్రులు, పార్టీ శ్రేణులు

తాడేపల్లి: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైయస్‌ఆర్‌ సీపీ) ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలా సాగుతోంది. ఆంధ్రరాష్ట్రంలో ప్రతి పల్లెలో పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం పండుగలా జరుగుతోంది. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనలో భాగంగా విలువలు, విశ్వసనీయతే అజెండాగా,æ ఊపిరిగా ప్రజా క్షేత్రంలో పురుడోసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు 11వ వసంతంలోకి అడుగు పెట్టింది. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే జోగి రమేష్, ఎంపీ నందిగం సురేష్‌ పాల్గొన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top