సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్స‌వం

తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, మహిళా అధికారులతో కలిసి కేక్‌ కట్‌ చేసి.. ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉమెన్స్‌ డే సందర్భంగా మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన‌ దిశ వాహనాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కాసేపట్లో ప్రారంభించనున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top