సీఎం వైయస్‌ జగన్‌ పాలనకు జనం జేజేలు

ఏడాది పాలనపై సర్వే నిర్వహించిన సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌

తాడేపల్లి: ఏడాదిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. సీఎం వైయస్‌ జగన్‌ ఏడాది పాలనపై ‘సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌’ (సీసీఎస్‌) జూన్‌ 2 నుంచి 8 వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాలు.. 44 నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నట్లు వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 2,881 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 55.2 శాతం గ్రామీణ, 44.8 శాతం మంది పట్టణ ప్రాంత ఓటర్లున్నారు. సీపీఎస్‌ తాజా సర్వే ప్రకారం రాష్ట్రంలో 55.8 శాతం మంది ప్రజలు వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. 

ఇంగ్లీషు మీడియం విద్యకు జై
అదే విధంగా ఇంగ్లిష్‌ మీడియం విద్యకు 71.6 శాతం మంది ఎస్‌ చెప్పారు. 19.5 శాతం మంది మాత్రమే విభేదించారు. ఇంగ్లిష్‌ మీడియం బోధన అంశంపై మాత్రం సర్వేను గతేడాది నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 12 మధ్య కాలంలో నిర్వహించారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రుల్లో 95 శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం కావాలన్నారు. 

కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని 75.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని 63.9 శాతం.. నెరవేర్చడంలేదని 35 శాతం మంది చెప్పారు.

అన్ని ప్రాంతాల్లోనూ అత్యధిక శాతం మంది ప్రజలు హామీలు అమలవుతున్నాయని అంటే.. ప్రతిపక్షాలు మాత్రం సీఎం వైయస్‌ జగన్‌ ఏడాది పాలన ఏమాత్రం బాగోలేదని విమర్శించాయి.  

సంక్షేమానికి అపూర్వ మద్దతు
ఆర్థిక ఒడుదుడుకుల్లో కూడా సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు బాగున్నాయని రాష్ట్రంలో 65.3 శాతం ప్రజలు అభిప్రాయపడుతుండగా.. 33.7 శాతం మంది బాగోలేవన్నారు. అమరావతి ప్రాంతంలో సైతం సంక్షేమ పథకాలు బాగున్నాయని 59.5 శాతం మంది అభిప్రాయపడ్డారు.  

సీఎం వైయస్‌ జగన్‌ పనితీరు బాగుందని 62.6% మంది ప్రజలు అభిప్రాయపడగా 36.1 శాతం మంది బాగోలేదన్నారు. 
 

Back to Top