ఓటరు జాబితాలపై దృష్టి సారించండి...ధర్మాన

గొల్లపూడిలో వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయం ప్రారంభం

విజయవాడ:ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి తరపున ఉంటే వారే శక్తివంతమైనవారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. విజయవాడ రూరల్‌ గొల్లపూడిలో ఆయన వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూత్‌ కమిటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.గల్లంతయిన ఓట్ల జాబితా లిస్ట్‌ తయారు చేయాలన్నారు.వైయస్‌ఆర్‌సీపీ గెలుపునకు కార్యకర్తలందరూ కష్టపడి  పనిచేయాలని పిలుపునిచ్చారు.గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వసంత కృష్ణ ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top