వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌ధానికి లేఖ రాయాల‌ని కేబినెట్ నిర్ణ‌యం

ముగిసిన కేబినెట్ స‌మావేశం

అమ‌రావ‌తి:  కోవిడ్ వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాయాల‌ని ఏపీ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ డోసులు త్వ‌ర‌గా కేటాయించాల‌ని ప్ర‌ధానికి లేఖ రాయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. 45 ఏళ్లు పైబ‌డ్డ‌వారికి వ్యాక్సినేష‌న్‌లో తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి మండ‌లి తీర్మానించింది.

సమావేశంలో ఎలక్ట్రానిక్‌ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా కోసం 3 వేల 30 కోట్లకు ఆమోదం తెలిపారు. వైయ‌స్ఆర్‌ ఉచిత భీమా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.  2,589 కోట్లతో వైయ‌స్సార్ ఉచిత భీమా పథకం అమలు,  వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం, మత్స్యకారులకు 10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాల‌ని మంత్రి మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది.  

Back to Top