ఏపీ అసెంబ్లీ చీఫ్‌ విప్‌, విప్‌లకు క్యాబినేట్‌ హోదా

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ చీఫ్‌ విప్‌, విప్‌లకు క్యాబినేట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌లు బుడి ముత్యాల నాయుడు, దాడి శెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు క్యాబినేట్‌ హోదా దక్కింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చీఫ్‌ విప్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు కూడా క్యాబినేట్‌ హోదా దక్కింది.

తాజా ఫోటోలు

Back to Top