జూలైలో అమలయ్యే పథకాలకు కేబినెట్‌ ఆమోదం

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. పలు కీలక అంశాలపై  కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపారు. ఈనెలలో చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రిమండలి అంగీకారం తెలిపింది. జూలై 18వ తేదీన  ∙జగనన్న తోడు పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే విధంగా ఈనెల 20న సీఆర్‌డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభాన్ని ఆమోదించింది. ఈనెల 21న నేతన్న నేస్తం కింద లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. అదేవిధంగా ఈనెల 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ఈనెల 28న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
 

Back to Top