ఎప్పటికీ వైయ‌స్‌ జగన్‌కు విధేయుడినే

శాప్ చైర్మ‌న్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి  
 

నంద్యాల‌ :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తమదని, తాను ఎప్పటికీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విధేయుడినేనని శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. కొన్ని మీడియా సంస్థల్లో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమైనవని అన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. తాను వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వీర సైనికుడినని, తనకు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నందికొట్కూరు పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు, శాప్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారన్నారు. తనకు ఇంత చేసిన పార్టీని తానెందుకు వీడుతానని, మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలన్నారు. తాను ఎప్పటికీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విధేయుడనేనని మరోసారి స్పష్టం చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top