అవనిగడ్డ: రాష్ట్ర మంత్రివర్గంలో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే అందించిన ఘనత సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని నేతలు కొనియాడారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన జగనన్నకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. దేశంలో సామాజిక న్యాయాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్నేనని పేర్కొన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర 5వ రోజు కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగింది. బడుగు, బలహీన వర్గాలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు ఏమన్నారంటే.. కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి – పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా ఓటు వేయని వారికి కూడా పథకాలు అందించిన ఒకే ఒక్క వ్యక్తి దేశంలో సీఎం జగన్ ఒక్కరే. – బీసీ డిక్లరేషన్ ప్రకారం 136 కులాలను వెలికి తీసి 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత జగనన్నది. – చంద్రబాబు ఏనాడైనా సామాజిక న్యాయం చేశాడా? ఒక్కరినైనా రాజ్యసభకు పంపాడా? – కేబినెట్‌లో 70 శాతం అంటే.. 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చిన సీఎం జగన్. – యాదవులను యంత్రాల్లా, ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు. – అన్ని సామాజిక వర్గాల వారికీ మంచి చేసిన వ్యక్తి సీఎం జగన్. – పేదరికం 12 నుంచి 6 శాతానికి పడిపోయిందంటే డీబీటీ ద్వారా మాత్రమే సాధ్యమైంది. సామాజిక న్యాయం అంటే అదే. – పేద పిల్లల చదువుల కోసం నాలుగేళ్లలోనే రూ.65 వేల కోట్లు ఖర్చు చేశారు జగనన్న. – పేద కుటుంబాల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు రావాలి, అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పిన నేత జగనన్న. మేరుగ నాగార్జున, మంత్రి – అంబేద్కర్, జ్యోతిరావుపూలే, సాహూ మహారాజ్, పెరియార్ రామస్వామి, బాబూజగ్జీవన్ రామ్, మౌలానా అబుల్‌కలామ్ ఆజాద్ లాంటి వారు సామాజిక అసమానతలు తొలగాలని ఉద్యమాలు చేశారు. – వారి ఆలోచనలను ఆచరిస్తూ, ముందెన్నడూ లేని విధంగా ఏపీలో సామాజిక విప్లవానికి తెరతీసిన వ్యక్తి సీఎం జగన్. – ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ధైర్యంగా గుండెమీద చేయి వేసుకొని బతకడానికి కారణం సీఎం జగన్. – జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక తెల్లరేషన్‌కార్డున్న ప్రతి పేదవాడికీ కార్పొరేట్ వైద్యాన్ని ఇప్పిస్తున్నారు. – పేద వాడి పిల్లలకు సీబీఎస్‌ఈ సిలబస్, కార్పొరేట్ విద్య, స్కూళ్లు బాగు చేయడం, పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చిన సీఎం జగన్. జోగి రమేష్, మంత్రి – దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ సామాజిక ధర్మాన్ని పాటించలేదు. సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. – మోపిదేవికి రాజ్యసభ, బీసీ బిడ్డ అయిన నాకు మంత్రి పదవి, జెడ్పీ చైర్మన్‌గా నా సోదరి, మంత్రిగా మేరుగ నాగార్జున, ఎంపీగా నందిగం సురేష్ అయ్యారంటే కారణం జగనన్న. – 50 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన జగనన్న. – వంద కోట్లు ఇస్తే చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చేవాడు. – బీసీలకు కొమ్ములున్నాయా అని చంద్రబాబు అంటాడు. నువ్వు తోక కట్ చేస్తానన్నప్పుడే ఇంట్లో కూర్చోబెట్టాం. – ఎస్సీల ఓట్లు, బీసీల ఓట్లు, ఎస్టీలు, మైనార్టీల ఓట్లు కావాలి గానీ పదవులు అవసరం లేదంటాడు చంద్రబాబు. – వంగవీటి మోహనరంగా గారిని చంపింది ఎవరు? చంద్రబాబు, టీడీపీయే. అలాంటి టీడీపీకి పవన్ కల్యాణ్ మద్దతిస్తున్నాడు. నందిగం సురేష్, ఎంపీ – జగనన్న రాక ముందు మనల్ని తక్కువ చేశారు. లోకువగా చూశారు. జగనన్న వచ్చాక మన ప్రభుత్వం, మన పాలన, మన ఇంటి వాతావరణం, పథకాలన్నీ ఇంటికి రావడం, పేదవాడు సంతోషంగా ఉన్నాడు. – నాడు–నేడు, ఇంగ్లీష్ మీడియం చదువులు, వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో అన్ని రకాలుగా జగనన్న అండగా ఉంటున్నారు. ఇది పెత్తందారులకు నచ్చలేదు. – మనం కోటీశ్వరులుగా ఉంటే వాళ్లకు ఇబ్బందులొస్తాయని జగనన్నపై నిందలేస్తున్నారు. – మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటామంటే కోర్టులకెళ్లారు. – అమరావతిలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు 53 వేల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మురికి కూపాలుగా మారుతాయని చంద్రబాబు కోర్టులో కేసు వేశాడు. – చంద్రబాబు ఎస్సీలను వెక్కిరించి జైల్లో కూర్చోబెడితే.. జగనన్న ఎస్సీలు, బీసీలు జైల్లో కాదు.. పార్లమెంటులో ఉండాలని నన్ను పార్లమెంటులో కూర్చోబెట్టారు. – విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వేలు తాడేపల్లివైపు చూపిస్తుంది. ఇదిగో నా ఆశయాలతో మీ జీవితాలు బాగు చేసే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చూపిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. మోపిదేవి వెంకటరమణ, ఎంపీ – ఏ ఇంటి గడప తొక్కినా రూ.2 లక్షలు – రూ.3 లక్షలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందిన పరిస్థితి. – రాజకీయంగా, నామినేటెడ్ పదవులు, మంత్రివర్గంలో, 70 శాతం సామాజిక వర్గాలకు ఇచ్చారు. – రాజ్యసభ సీట్లను చంద్రబాబు రూ.50 కోట్లు, రూ.100 కోట్లు అని బేరం పెట్టేవాడు. – అదే జగన్‌గారు.. బీసీనైన నన్ను, పిల్లి సుభాస్ చంద్రబోస్, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపారు. – రాష్ట్రంలో కేరాఫ్ అడ్రస్ లేని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ మళ్లీ జనాన్ని మోసం చేసేందుకు వస్తున్నారు. సింహాద్రి రమేష్ బాబు, ఎమ్మెల్యే – మంత్రి పదవుల్లో 5 ఎస్సీలకు, 10 బీసీలకు, ఒకటి ఎస్టీలకు ఇచ్చిన ఘనత జగనన్నది. – 98 శాతం హామీలు నెరవేర్చి మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపుతున్నారు జగనన్న. – జగనన్న న్యాయం తరఫున ఉంటాడు. ధర్మం తరఫున ఉంటాడు. – చంద్రబాబుకు నిజాయితీ లేదు. అందుకే చాలా పార్టీలతో కలవాల్సిన అవసరం వస్తోంది.