చంద్రబాబు మాటలన్నీ అసత్యాలే..

అమరావతికి ప్రపంచ బ్యాంకు మద్దతిస్తుంది

రూ. 5 వేల కోట్ల సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది

ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంపై ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటన

అమరావతి: చంద్రబాబు ప్రపంచ బ్యాంకు నిధులపై అసత్యాలు మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అమరావతికి మద్దతిస్తున్నట్లుగా ప్రపంచ బ్యాంకు తెలిపిందని, రూ. 5 వేల కోట్ల సాయం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంపై ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అమరావతి స్థిరమైన మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకుకు మద్దతు, అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నుంచి సాయం కోరుతూ ఏపీ ప్రభుత్వం 2016 అక్టోబర్‌ 8న ఆర్థిక వ్యవహారాల శాఖ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎకానమిక్స్‌ అఫైర్స్‌కు ప్రతిపాదనలు సమర్పించింది. అయితే ప్రాజెక్టు ప్రతిపాదన కోసం చేసిన ఈ అభ్యర్థన 2017 మే 25న ప్రతిపాదన పునరుద్ధరించబడిన తరువాత 2017 జూన్‌ 12న మాత్రమే నమోదు చేయబడింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు నుంచి నిధుల కోసం డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అఫైర్స్‌ క్లియర్‌ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు ఐదు ఉమ్మడి మిషన్లు, అనేక వ్యక్తిగత మిషన్లు నిర్వహించాయి. ఈ ప్రాజెక్టుకు అమెరికా డాలర్లు 715 మిలియన్స్‌ సుమారు మన రూపాయల్లో 5 వేల కోట్ల వ్యయంతో అమరావతి స్థిరమైన మౌలిక సదుపాయాలు, సంస్థగత అభివృద్ధి ప్రాజెక్టు అనే పేరు పెట్టారు. రుణ భాగాన్ని ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకుల మధ్య అమెరికా భాగం రూ. 2100 కోట్లు, ఏఐఐబీ పెట్టుబడి రూ. 1500 కోట్లు, ఏపీ ప్రభుత్వ వాటా రూ. 1500 కోట్లతో ప్రాజెక్టులు టేకప్‌ చేయాలని ప్రతిపాదన చేశారు. 
ప్రాజెక్టులు..
1. సమగ్ర పట్టణ మౌలిక సదుపాయాలు, సేవలు. 
2.వాతావరణ స్థితిస్థాపక మౌలిక సదుపాయాలు, 
3. పౌరుల ప్రయోజన భాగస్వామ్యం.
4. సంస్థాగత, ఆర్థిక అభివృద్ధి. 
5. ప్రాజెక్టు నిర్వహణ, అమలు మద్దతు

ఈ ఐదు అంశాలకు అప్పు వినియోగించాలని ప్రతిపాదన చేశారు. ప్రాజెక్టు ఆమోదం లభిస్తుందనే భావనతో అప్పటి ప్రభుత్వం పది కాంట్రాక్టు ప్యాకేజీల్లో 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టులను ప్రారంభించింది. 
– రూ. 1872 కోట్ల విలువతో 92 కిలోమీటర్ల పొడవు గల పది రోడ్డు పనులను ప్రారంభించింది. 
– రూ. 947 కోట్లతో 48.3 కిలోమీటర్ల కాల్వలు, 0.56 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలకు వరద పనులు. ప్రాజెక్టు ఆమోదం ఆలస్యం కావడంతో పై ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వ నిధులతో చేపట్టారు. 
– ఏడు రహదారుల పనులకు ఇచ్చిన కాంట్రాక్టులు రెట్రో యాక్టివ్‌ ఫైనాన్సింగ్‌ అర్హత లేదని, ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం బరించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు సమాచారం ఇచ్చింది. ఇంకా అనేక సాంకేతిక పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ అవగాహన లోపం, అలసత్వ వైఖరికి ఇది స్పష్టమైన ప్రతిబింబంగా ఉంది. పెద్ద సంఖ్యలో భూ యజమానులు, ఎన్జీఓలు ప్రపంచ బ్యాంకు జవాబుదారి యంత్రాంగానికి ఐఏఎం పలు విజ్ఞప్తులు చేశాయి. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో లోపాలోపాలను గురించి ప్రాజెక్టు కారణంగా పర్యావరణ, ఆర్థిక, సామాజిక రంగాలపై పడే పలు దుష్ప్రభావాలను గురించి వారు అర్జీలు సమర్పించారు. ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని 2017 సెప్టెంబర్‌ 13 నుంచి 16 వరకు ప్రపంచ బ్యాంకు యొక్క ఐఏఎం తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసి అమరావతిని సందర్శించింది. ప్రాజెక్టు రూపకల్పన పర్యావరణ, ఆర్థిక, సామాజిక రంగాలపై ప్రాజెక్టు ప్రభావం అనే అంశాలను ఈ బృందం అధ్యయనం చేసింది. 2017 సెప్టెంబర్‌ 27న ఈ బృందం తన తొలి నివేదికను సమర్పించింది. 2017 నవంబర్‌ 27న ఒకసారి, 2018 జూన్‌ 26న మరోసారి ఈ బృందం తన నివేదికను తాజాగా రూపొందించింది. అంతిమంగా ఈ బృందం 2019 మార్చి 29న తుది నివేదిక సమర్పించింది. 

ప్రాజెక్టు యాజమాన్యం, ప్రభావిత ప్రజలు, వినతిదారుల మధ్య పరస్పర విరుద్ధమైన సంఘర్షణాత్మక అంశాలు ఉన్నాయని ఈ తనిఖీ బృందం తన నివేదికలో పేర్కొంది. జరగబోతాయని భావించిన నష్టాలను చాలా తీవ్ర స్వభావాన్ని కలిగిన వేళ ప్రాజెక్టుతో ఇవి ముడిపడి ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. దర్యాప్తు ద్వారానే ఈ అంశాలను నిర్ధారించుకోగలం అని ఈ నివేదికలో పేర్కొన్నారు. జరుగుతాయని భావిస్తున్న నష్టాలను జీవనోపాధి, పునరుద్ధరన చర్యలు చేపట్టకపోవడం, ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన తప్పనిసరి పునరావాస విధానం మొదలైన అంశాలపై దర్యాప్తు నిర్వహించాలని బృందం సిఫారస్సు చేసింది. ఈ బృందం నివేదిక కారణంగా ప్రాజెక్టు ప్రతిపాదన సమర్పించిన రెండు సంవత్సరాలకు పైగా కాలం గడిచినప్పటికీ ప్రపంచ బ్యాంకు బోర్డు ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోలేదు. జరగబోతాయని భావించి నష్టాలు. జీవనోపాధి, పునరుద్ధరన చర్యలు చేపట్టకపోవడం, బ్యాంకుకు సంబంధించిన తప్పనిసరి పునరావాసన విధానం అంశాలపై దర్యాప్తు నిర్వహించాలన్న సిఫారస్సు ఆధారంగా భారతప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ 2019 జూలై1 నాటికి ఏపీ ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని కోరింది. అమరావతి విషయంలో వివరణాత్మక దర్యాప్తు జరుగుతున్న కారణంగా 2019 జూలై 31 వరకు గడువు కాలం ఏపీ ప్రభుత్వం కోరింది. ప్రాజెక్టు ఆమోదానికి ముందస్తుగా దర్యాప్తును అనుమతించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జూలై 15వ లోగా ఏపీ ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ పేర్కొంది. ప్రాజెక్టు ఆమోదానికి దర్యాప్తు అనుమతించడం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. భారత ప్రపంచ బ్యాంకు సంబంధాల చరిత్రలో ఇంతకు పూర్వం ఇటువంటి సందర్భం ఎప్పుడూ తలెత్తలేదు. తదుపరి చర్యపై ఆర్థిక వ్యవహారాల శాఖ సముచిత నిర్ణయం తీసుకోవచ్చని తెలియజేస్తూ 2019 జూలై 15 ఏపీ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి తెలియజేసింది. అమరావతి ప్రాజెక్టులను విరమించుకోవాలని 2019 జూలై 16 భారతప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రపంచ బ్యాంకుకు తెలియజేసింది. ఆర్థిక వ్యవహారాల శాఖ చేసిన ప్రతిపాదనను ప్రపంచ బ్యాంకు అంగీకరించినట్లుగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం వచ్చే అదనపు ప్రతిపాదనలకు తాము మద్దతు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్లుగా కూడా ప్రపంచ బ్యాంకు తెలియజేసింది. నూతన రాజధాని, నగర అభివృద్ధి నమూనా వల్ల కలిగే ప్రతికూల, పర్యావరణ, సామాజిక, ఆర్థిక ప్రభావాలను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్ని విధాలుగా స్పష్టంగా తెలుస్తుంది. గత ప్రభుత్వ చర్యలు భారతదేశాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. 

మన ప్రభుత్వ సుపరిపాలన అజెండా, అభివృద్ధి పని విధాల్లో ప్రభావితమైన ప్రపంచ బ్యాంకు కొత్తగా ఆరోగ్యరంగానికి 328 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల సాయాన్ని మంజూరు చేసింది. ఈ ఒప్పందం 2019 జూన్‌ 27న కుదిరింది. ప్రభుత్వ వ్యూహాలు, నవరత్నాల పథక విధానాలు ప్రపంచ బ్యాంకు యొక్క అభివృద్ధి ప్రాధాన్యతతో ఉన్నాయని మౌకికంగా పేర్కొంది. ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి తన సాయం పెంచుతున్నట్లుగా హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందిస్తుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ కోసం మానవ అభివృద్ధి వేదికను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రపంచ బ్యాంకు తన ఆసక్తిని వ్యక్తం చేసింది.

 

Back to Top