దొడ్డిదారిన రాజ‌ధాని భూములు కాజేశారు

అమ‌రావ‌తి రాజ‌ధాని మీద చ‌ర్చ జ‌రుగుతుంటే అమ‌రావ‌తి గురించి త‌ప్ప మిగ‌తా అంతా మాట్లాడారు. ప్ర‌జ‌లు మంచి అవ‌కాశమిస్తే అయిదేళ్లు ఏం చేయ‌లేదు. హైద‌రాబాద్ అభివృద్ధిలో ప్ర‌తి ఆంధ్రుడి పాత్ర ఉందనేది కాద‌న‌లేని నిజం. రాష్ట్రం విడిపోయాక పూర్తిగా వ్య‌వ‌సాయం మీద ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి. ప‌రిశ్ర‌మ‌లు లేవు, నిధులు, క‌నీసం ప‌రిపాల‌న చేసేందుకు రాజ‌ధాని కూడా లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొత్తగా కొలువుదీరిన ప్ర‌భుత్వం పాత చేదు అనుభ‌వాల‌ను గుర్తు చేసుకుని స‌వాళ్ల‌ను అధిగమించాల్సింది. యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో దృష్టిపెట్టాలి. ఎంతో విలువైన మొద‌టి ఐదేళ్ల పాల‌నను దోపిడీకే కేటాయించారు.

శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీలో ఉన్న నిపుణులు చాలా బాధ్య‌తాయుతంగా ప‌నిచేశారు. నిజానికి శివ‌రామ‌కృష్ణ‌న్ కేన్స‌ర్ వ్యాధితో ఉన్నా కేంద్రం ఇచ్చిన బాధ్య‌త‌ను అద్భుతంగా నిర్వ‌ర్తించారు. 13 జిల్లాల‌కు గాను 10 జిల్లాల‌ను స్వ‌యంగా ప‌ర్య‌టించారు. చివ‌రికి అలాగే చ‌నిపోయారు. అంత‌టి మ‌హానుభావుడు ఇచ్చిన రిపోర్టును క‌నీసం చ‌ర్చ‌కు కూడా తీసుకోకుండా గాలికొదిలేశారు. శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ అంటే పార్ల‌మెంట్ క‌మిటీ అన్న‌ట్టు లెక్క‌. కానీ ఆ రిపోర్టును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా నారాయ‌ణ క‌మిటీ వేశారు. రోజుకోచోట రాజ‌ధాని అని పేర్లు ప్ర‌క‌టించి ప్ర‌భుత్వంలో ఉన్న పెద్ద‌లు మాత్రం చ‌డీచ‌ప్పుడు కాకుండా అమ‌రావ‌తిలో భూములు కొనుగోలు చేశారు. వివ‌రాలు చూస్తే దాదాపు 4070 ఎక‌రాలు చంద్ర‌బాబు అనుకూలురు కొనుగోలు చేసిన‌ట్టు ఈ రోజుకి తేలిన లెక్క‌. ఇది మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఎక్క‌డో హైద‌రాబాదు, క‌ర్నూలు, అనంత‌పురంలో నివాస‌ముండే టీడీపీ నాయ‌కులు ఉన్న‌ట్టుండి తెలిసీతెలియ‌ని ఉద్దండ‌రాయునిపాలెం, తుళ్లూరులో ఎందుకు భూములు కొన్నారో ఈ లెక్క‌లే చెబుతాయి. జూన్ 2014 నుంచి డిసెంబ‌ర్ 2014లోపు జ‌ర‌గిన భూముల కొనుగోళ్లు గ‌మ‌నిస్తే ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని రుజువుఅవుతుంది.

రాజ‌ధానిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయ‌కుల వివ‌రాలు (1.06.2014 నుంచి 01.12.2014 మ‌ధ్య‌)
చంద్ర‌బాబు హెరిటేజ్ కంపెనీ కంతేరులో 14.22 ఎక‌రాలు కొనుగోలు చేసింది
స‌ర్వే నెంబ‌ర్లు 56, 27, 62, 63 స‌ర్వే నెంబ‌ర్ల‌లో భూములు కొన్న‌ట్టు ఆధారాలున్నాయి.
మాజీ మంత్రి నారాయ‌ణ త‌న బంధువులు ఆవుల మునిశంక‌ర‌రావు, రావూరు సాంబ‌శివ‌రావు, ప్ర‌మీల పేర్ల‌ మీద 55.27 ఎక‌రాలు,
ప్ర‌త్తిపాటి పుల్లారావు గుమ్మ‌డి సురేష్ అనే పేరు మీద 38.84 ఎక‌రాలు,
ప‌రిటాల సునీత త‌న అల్లుడి పేరు మీద, రావెల కిశోర్‌బాబు మైత్రి ఇన్‌ఫ్రా పేరు మీద 40.85 ఎక‌రాలు, కొమ్మాలపాటి శ్రీధ‌ర్  అభినంద‌న్ ఇన్‌ఫ్రా పేరు మీద 68.60 ఎక‌రాలు
జీవీఎస్ ఆంజ‌నేయులు గోరుగుంట్ల ల‌క్ష్మీ సౌజ‌న్య పేరు మీద  37.84 ఎక‌రాలు
ప‌య్యావుల కేశ‌వ్ ప‌య్యావుల శ్రీనివాస్‌, వేం న‌రేంద‌ర్‌రెడ్డి పేర్ల మీద‌ 15.30 ఎక‌రాలు
ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి కోడుకు ప‌ల్లె వెంక‌ట కిశోర్‌కుమార్‌రెడ్డి పేరు మీద 7.56 ఎక‌రాలు
వేమూరు ర‌వికుమార్ ప్రసాద్ 25.68 ఎక‌రాలు  (లోకేష్‌కు అత్యంత స‌మీప వ్య‌క్తి)
లింగ‌మ‌నేని ర‌మేశ్  సుజ‌న‌, ప్ర‌శాంతి పేర్ల మీద‌ 351 ఎక‌రాలు
పుట్టా మ‌హేశ్‌యాద‌వ్  (య‌న‌మ‌ల అల్లుడు) 7 ఎక‌రాలు
కోడెల శివ‌ప్ర‌సాద‌రావు శ‌శి ఇన్‌ఫ్రా పేరు మీద 17.13ఎక‌రాలు
ధూళిపాళ్ల న‌రేంద్ర చౌద‌రి ధూళిపాళ్ల వైష్ణ‌వి, పుల్ల‌య్య పేర్ల మీద‌ 13.50 ఎక‌రాలు

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు పేరుతో దోపిడీలు
వీడీసీ ఫెర్టిలైజ‌ర్స్ ప్రై లి. ఎంఎస్‌పీ రామారావు, బాల‌కృష్ణ వియ్యంకుడు బావ‌మ‌రిదికి జ‌గ్గ‌య్య పేట‌లో 499 ఎక‌రాలు
కోడెల శివ‌ప్రసాద‌రావు 17.13 ఎక‌రాలు
లింగ‌మ‌నేని ర‌మేశ్  1.76+2.34 ఎక‌రాలు
య‌ల‌మంచిలి శివ‌లింగ‌ప్ర‌సాద్ 4
మొత్తం 525 ఎక‌రాలు ధారాద‌త్తం చేశారు.
అవ‌స‌రాల‌ని బ‌ట్టి బౌండ‌రీలు మార్చ‌డం, కంపెనీల‌కు భూములు రాసివ్వ‌డం.. కొత్త జీవోలు ఇవ్వ‌డం చేసి భూములు దొచుకుతిన్నారు. దానికి సీఆర్‌డీఏగా మార్చి కేపిట‌ల్ ఏరియా అని పేరు మార్చారు.

డిసెంబ‌ర్ 30, 2014న రాజ‌ధాని అని డిసైట్ చేసి జురాంగ్ అండ్ సుర్బాన్ అనే కంపెనీకి డిజైన్ ఇవ్వ‌మ‌ని ఇచ్చారు. ఆ కంపెనీ  2015 జూన్ నాటికి 391 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంతో డిజైన్ ఇచ్చేశారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు అండ్‌కో 2016 వ‌ర‌కు ఇష్టారాజ్యంగా మార్పులుచేర్పులు చేసుకుంటూ పోయారు. రాజ‌ధాని ప‌రిధిని 391చద‌ర‌పు కిలోమీట‌ర్ల నుంచి 217 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల‌కు త‌గ్గించారు. రాజ‌ధాని ప‌రిధిలో ఉండే త‌మ బినామీల భూములు ల్యాండ్ పూలింగ్‌కు గురికాకుండా ఎక్కువ ధ‌ర ప‌ల‌కాల‌నే ఉద్దేశ్యంతో ఈ ప‌నిచేశారు.
చంద్ర‌బాబు హెరిటేజ్ కంపెనీకి, లింగ‌మ‌నేని భూమికి అనుకుని ఉండేలా రింగ్‌రోడ్డును కూడా డిజైన్ చేశారు. అసైన్డ్ భూములున్న న‌వ‌లూరు, ఎర్ర‌బాలెం ద‌ళితులు, బీసీల‌ను బెదిరించి త‌క్కువ రేట్ల‌కే కొనుగోలు చేశారు. దానికీ మంగ‌ళ‌గిరి స‌బ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా చేస్తారు. వీరికి అనుకూలంగా
మ‌ళ్లీ జీవోలు ఇస్తారు.
లేని లంక భూమ‌లును ఉన్న‌ట్టుగా చూపించి ప్లాట్లు కాజేశారు. అబ్జెక్ష‌నబుల్‌, అన్అబ్జ‌క్ష‌న‌బుల్ గ‌వ‌ర్న‌మెంట్ ల్యాండ్లు పేరుతో ప్లాట్లు మింగేశారు.

కొల్లి శివ‌రాం 41.39 ఎక‌రాలు
గుమ్మ‌డి సురేష్  42.92
బొరుసు శ్రీనివాసులు 14.07
(పై ముగ్గురూ నారా లోకేష్ బినామీలు)
నిమ్మ‌గ‌డ్డ శాంత‌కుమారి 13.19
క‌సిరెడ్డి పేర‌య్య 10.96
మైత్రి ఇన్‌ఫ్రా తేళ్ల సురేష్ 10.48
ధూళిపాళ్ల ప‌ద్మావ‌తి 9.97
ధూళిపాళ్ల సృజ‌న 9.05
ల‌క్ష్మీసెట్టి సుజాత 8.91
చిక్కాల విజ‌య 8.76
చ‌ల్లా హ‌నుమంత విజ‌య‌కుమారి 8.14
యాగంటి శ్రీకాంత్ 7.33
ప‌రుచూరి ప్ర‌భాక‌ర్‌రావు 6.33
య‌ల‌మంచి ప్రసాద‌కుమారి 5.96
అంబ‌టి సీతారాం 5.7
వీరే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు.
పాల‌సీలు లేకుండా ల్యాండ్ అలాట్‌మెంట్ చేశారు. రిజ‌ర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా, కాగ్‌, ఎస్బీఐ, సిండికేట్, కెన‌రా బ్యాంకుల‌కు ఎక‌రా 4 కోట్లు.. కానీ వీళ్ల‌కు న‌చ్చిన విద్యాసంస్థ‌కు మాత్రం ఎక‌రా 20 ల‌క్ష‌ల‌కే ఇస్తారు.

 

తాజా ఫోటోలు

Back to Top