ప్రపంచం మొత్తం ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి

వైయస్‌ జగన్‌ సర్కార్‌పై బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ప్రశంసలు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ ప్రశంసించారు. పది లక్షల జనాభాకు 14,049 టెస్టులు చేస్తున్నారంటూ.. ప్రపంచం మొత్తం ఏపీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 11,158 గ్రామ సచివాలయాల్లో ప‌నిచేసే సిబ్బందితో క‌లిపి 4.5 లక్షల మంది వలంటీర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిందని, అదే విధంగా క్వారంటైన్‌ను పర్యవేక్షించడానికి అధికారులను ప్రభుత్వం నియమించిందని ట్వీట్‌ చేశారు. 

కాగా, రాష్ట్రంలో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల పైచిలుకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 46.26 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ రేటు 6.20 శాతం ఉండగా ఏపీలో మాత్రం 1.38 శాతంగా ఉంది.

Back to Top