వైవీ సుబ్బారెడ్డి చొరవతో పాడి అభివృద్ధికి బ్రెజిల్‌ సాంకేతికత..

మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన బ్రెజిల్‌ బృందం..

 

ప్రకాశం:ఒంగోలు వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చొరవతో ఒంగోలు ఆవులు,గెదేలు అభివృద్ధికి ఉపయోగపడే బ్రెజిల్‌ టెక్నాలజీ రాష్ట్రానికి రానుంది.రెండేళ్ల క్రితం బ్రెజిల్‌లో పర్యటించిన ఆయన ఒంగోలు బ్రీడ్‌ ఆవులు,గేదెలు అభివృద్ధికి బ్రెజిల్‌  సాంకేతికతను అందించాల్సిందిగా బ్రెజిల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.దీనికి స్పందించిన బ్రెజిల్‌ ప్రభుత్వం మొదటిగా గేదెలు అభివృద్ధికి తమ సాంకేతికతను అందించేందుకు అంగీకారం తెలిపింది.

దీనికి సంబంధించిన బ్రెజిల్‌ బృందం రాష్ట్రానికి వచ్చింది.వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ బ్రెజిల్‌ సాంకేతిక  మన పశు సంపదను సంరక్షించుకోవడంతో బాటు పాల ఉత్పత్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.

 

Back to Top