సామాజిక సాధికార బస్సుయాత్రకు బ్ర‌హ్మ‌ర‌థం

మూడు ప్రాంతాల నుంచి మొద‌లైన బ‌య‌స్సు యాత్ర‌

ఊరూరా ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ప్ర‌జ‌లు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో జ‌రిగిన మేలును వివ‌రిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు

మొద‌టి రోజు బ‌స్సు యాత్ర సూప‌ర్ స‌క్సెస్‌

అమ‌రావ‌తి:  జగనన్న పాలనలో సామాజిక సాధికారిత యాత్ర ద్వారా రాష్ట్రానికి జరిగిన మేలును ప్రజలకు వివరించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన సామాజిక సాధికార బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. ఊరూరా ప్ర‌జ‌లు బస్సు యాత్ర‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. గురువారం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ బ‌స్సు యాత్ర‌లు మొద‌ల‌య్యాయి. 

ఇచ్చాపురం నుంచి..
ఇచ్చాపురం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి,  మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు  మేరుగ నాగార్జున, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, మాజీ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరదు కల్యాణి పాల్గొన్నారు.

తెనాలి నుంచి..
 తెనాలి రూరల్ కొలకలూరులోని బాపయ్యపేట నుంచి సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభమైంది.  పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్రా, జ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, హఫీజ్ ఖాన్,మాజీ ఎంపీ బుట్టా రేణుక , గుంటూరు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, కల్పలతారెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు.  


శింగ‌న‌మ‌ల నుంచి ..
రాయ‌ల‌సీమ నుంచి సామాజిక సాధికార బస్సు యాత్ర శింగనమలలో ప్రారంభమైంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి యాత్ర‌ను ప్రారంభించారు. బుక్క‌రాయ‌స‌ముద్రం వ‌ర‌కు తొలి రోజు యాత్ర సాగింది. ఈ యాత్ర‌లో మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌, ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి, త‌దిత‌రులు పాల్గొన్నారు.  బ‌స్సు యాత్ర సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడారు.

పేదలకు జరిగిన మేలు చెప్పేందుకు బస్సు యాత్ర చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన సంస్కరణలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఓ రిమాండు ఖైదీ కోసం టీడీపీ కార్యకర్తలు రొడ్డేక్కారని ఎద్దేవా చేశారు. కుంభకోణాలతో చంద్రబాబు అవినీతి పాలన అందించారని విమర్శించారు. 

ఏ ముఖ్యమంత్రి చేయలేని సామాజిక ధర్మాన్ని సీఎం వైయస్‌ జగన్‌ పాటించారని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. కోస్తాంధ్రలో మొట్టమొదటి సామాజిక యాత్ర భేరి మోగించబోతున్నాం. నాలుగున్నరేళ్లలో దమ్ముగా మేం తల ఎత్తుకునేలా చేశారు. మాకు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అనే ఒకే ఒక్క నాయకుడున్నాడు. సా చంద్రబాబు పాపం పండింది. 40 ఏళ్లలో చేసిన అవినీతి బయటపడింది. నారా భువనేశ్వరి నిజం గెలవాలంటూ రోడ్డెక్కారు. నిజం గెలిచింది...నిజం నిగ్గు తేలింది.. కాబట్టే చంద్రబాబు బొక్కలో ఉన్నాడు. 40 ఏళ్లలో చంద్రబాబు వెన్నంటే ఉన్న మీరే చంద్రబాబు పాపాలు చెప్పాలి. వెన్నంటే ఉండి మీ తండ్రికి ఎలా వెన్ను పోటు పొడిచాడో మీరు చెప్పాలి. రెండు ఎకరాలతో రెండు లక్షలు ఎలా దోచుకున్నారో మీరు చెప్పాలి. పేదల కోసం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారో మేం చెప్పేందుకు రెడీగా ఉన్నామ‌ని మంత్రి పేర్కొన్నారు. 

Back to Top