పార్టీ, ప్రభుత్వాన్ని‌ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం.. 

 
 మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వాన్ని‌ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. మంత్రిగా ప్ర‌మాణ శ్రీ‌కారం చేసే ముందు బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గం కూర్పు అద్భుతంగా ఉంద‌న్నారు. జనాభాలో ఎక్కువగా ఉన్న వారికి‌ సీఎం వైయ‌స్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని.. మేం భాగస్వాములవ్వాలన్న బీసీల కోరిక సీఎం వైయ‌స్‌ జగన్ నెరవేర్చారని ప్రశంసలు కురిపించారు. అసంతృప్తితో ఉన్నవారిని‌ కలుపుకుని ముందుకెళ్తాం.. మేమందరం ఒకటేనని స్పష్టం చేశారు. కేబినెట్‌పై తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదని.. ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తూ.. ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు ముందుకు సాగుతామన్నారు. 

తాజా వీడియోలు

Back to Top