పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాలి

మంత్రి బొత్స సత్యనారాయణ

 కర్నూలు:  పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలన్నింటిని ప్రజలకు అందించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. కర్నూలులో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బొత్స సత్యనారాయణ అనంతరం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి పని చేసేవారికి మంచి రోజులు  తెలిపారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని మర్చిపోయిందని విమర్శించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గ్రామ వలంటీర్లు వారధిగా ఉండాలన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలన్నింటిని ప్రజలకు అందించాలని తెలిపారు.

అమ్మ ఒడి, పెన్షన్‌ వంటి వాటిని ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలన్నారు బొత్స. వలంటీర్ల నియమాకలపై టీడీపీ నేతలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. వేడుకల్లో ఎంపీ సంజీవ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు హాఫీజ్‌ఖాన్‌, ఆర్థర్‌, సుధాకర్‌, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి, పార్టీ కర్నూలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 

Back to Top