మామను చంపిన ‘బాబు’ ఏ మొహం పెట్టుకుని మహానాడు చేస్తున్నాడు

మంత్రి బొత్స సత్యనారాయణ
 

 విశాఖపట‍్నం: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మామను(నందమూరి తారక రామారావు) చంపి తద్దినం పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మహానాడు చేస్తున్నాడు. చంద్రబాబు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. మహానాడులో చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్లీ అధికారంలోకి వస్తానని చంద్రబాబు కలలు కంటున్నారు.  చంద్రబాబు కంటే ఉన‍్మాది పాలన ఎవరిది అని ప్రశ్నించారు.

Back to Top