అప్పుడే తొందరపడితే ఎలా... ముందుంది ముసళ్ల పండుగ

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ 
 

అమరావతి: అప్పుడే తొందరపడితే ఎలా... ముందుంది ముసళ్ల పండుగ అని టీడీపీని ఉద్దేశించి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ  వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఆర్టీసీ బస్సుల కొనుగోలు స్కాం, ఫైబర్‌ గ్రిడ్‌ స్కామ్‌లకు సంబంధించిన అవినీతిని బయటకు తీస్తామని హెచ్చ‌రించారు.  అవినీతి పరులపై ప్ర‌భుత్వం విచారణ చేయకుండా ఎలా ఉంటుంద‌ని ప్రశ్నించారు. టీడీపీ హ‌యాంలో అవినీతి జరిగిందని విచార‌ణ‌లో నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు.  ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరగలేదని ఎందుకు ఖండించలేదని బొత్స నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో  వాహనాలు కొనుగోలు చేయలేదని చెప్పండి అని సవాల్‌ విసిరారు. 

Back to Top