కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌సీపీదే విజయం

లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలడా?

 మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేప‌ల్లి: కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌దే విజయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుప్పంకి నీళ్ళు ఇవ్వలేదని అనడానికి సిగ్గులేదాని ‍ఫైర్‌ అయ్యారు. 40 ఏళ్ళు కుప్పానికి ఎమ్మెల్యే ఎవరున్నారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడని,  దొంగ ఓట్ల సంస్కృతి ఎవరిదో అందరికి తెలుసని,ఒడిపోతామని తెలుసు కాబట్టే దొంగ ఓట్లు, అల్లర్లు అంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ముమ్మాటికీ మూడు రాజధానులు ఉంటాయని, అడ్డుకోవడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటిని ఎవ్వరు ఆపలేరంటూ ధీమా వ్యక్తం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో యాత్ర జరుగుతోందిని ధ్వజమెత్తారు. లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలడా అని ప్రశ్నించారు.

తాజా ఫోటోలు

Back to Top