అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

న్యాయస్థానాన్ని ఒప్పించి.. కోర్టు ఆదేశాల మేరకే తాము పనిచేస్తాం

పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజధాని కేసుపై రోజువారీ విచారణ అన్నారు.. అయితే పిటిషనరే వాయిదా అడగాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పిటిషనరే వాయిదా కోరడం వెనుక ఏం దురుద్దేశాలున్నాయన్న బొత్స... న్యాయస్థానాన్ని ఒప్పించి.. కోర్టు ఆదేశాల మేరకే తాము పనిచేస్తామని పేర్కొన్నారు. ఏది ఏమైనా అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు.

మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడారు.  దేశంలోని అన్ని నగరాల్లో స్వచ్ఛ్‌ భారత్ కింద వ్యర్థాల మేనేజ్‌మెంట్‌లో సర్వే చేశారు . 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వాటర్ ప్లస్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయి అని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో అన్ని పట్టణాలను ఇలాగే తయారు చేయాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. 

 6 నెలల్లో 80 వేల టిడ్కో ఇళ్లు.. మరో 6 నెలల్లో మరో 80 వేలు... మిగిలినవి తర్వాత 6 నెలల్లో ఇస్తామ‌ని మంత్రి బొత్స తెలిపారు. మొత్తం 2.60 లక్షలు ఇళ్లు ఉన్నాయి. అన్ని త్వరగా ఇచ్చేస్తాం. ఈ అంశాల గురించి టీడీపీ నేత లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వ పాలనతో ఏం చేశారు, ఎలా చేశారన్న పొలికతో చెప్తే బాగుండేది. చేయూత, నేతన్న నేస్తం వంటి ఎన్నో పథకాల వల్ల బీసీలకు న్యాయం జరుగుతోంది. వారి జీవన విధానం మారడానికి ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నాం. వారి ఆర్థిక, జీవన స్థితి మారేలా కృషి చేస్తున్నామ‌ని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Back to Top