చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు

 మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజ‌య‌వాడ‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకి చివరి ఎన్నికలు అన్నాడు... ఆయన కోరిక తప్పక తీరుతుంది. దేవుడు తథాస్తు అంటాడు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. మూడుసార్లు ప్రజలు అవకాశం ఇస్తే మోసం చేశాడు. అసెంబ్లీలో ఆయన భార్యను ఎవరూ కించపరచలేదు. సానుభూతి కోసమే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. చంద్రబాబు కోరుకున్నట్టే ప్రజలు తీర్పు ఇస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు.

 చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు సైతం స్పందించారు. కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు. ఆ విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసు. చంద్రబాబుకే ఆలస్యంగా తెలిసింది. ఇ‍ప్పటికే కుప్పం చేజారిపోయింది’ అని కామెంట్స్‌ చేశారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top