గత ఐదేళ్లలో పేదల కడుపు కొట్టారు..

టీడీపీ దోపిడీని ఆధారాలతో బయటపెడతాం

తప్పు ఒప్పుకుని దోచుకున్న డబ్బు ప్రజలకు చెల్లించాలి

టీడీపీ హ‌యాంలో  పేదల ఇళ్ల పథకం.. కుంభకోణం పథకంలా మారింది

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: గత ఐదేళ్లలో పేదల ఇళ్ల పథకం కుంభకోణం పథకంలా మారిందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిప‌డ్డారు.  ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడతూ పేదవాడి కడుపు కొట్టి స్కాంలకు పాల్పడటం సమంజసం కాదన్నారు.ఇప్పడు మాజీ సీఎం,మంత్రులు నీతి వ్యాఖ్యలు బోధిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. సీఎం జగన్‌ వ్యాఖ్యలు కక్షపూరితమంటూ ఎదురుదాడి చేస్తున్నారన్నారు. చదరపు అడుగు రూ.1100  అయితే రూ.2,300 దోచుకున్నారని తెలిపారు.కొత్త టెక్నాలజీ పేరు చెప్పి అధిక ధరలకు కాంట్రాక్ట్‌లు కేటాయించారన్నారు.పేదవాళ్లకు ఎన్ని ఇళ్లు కేటాయించారని ప్రశ్నించారు.కనీసం ఒక్కటైనా అప్పగించారా అని ప్రశ్నించారు. ఇది రాజకీయ ఉపన్యాసం కాదు.వాస్తవాలు చెబుతున్నామన్నారు.

వైయస్‌ హయాంలో 25 లక్షల ఇళ్లు కడితే..తామే కట్టినట్టుగా చెబుతున్నారన్నారు.వైయస్‌ హయాంలో ఉచితంగా ఇళ్లు కేటాయించామన్నారు.రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే సీఎం జగన్‌ ఉద్దేశమని తెలిపారు.ఎక్కడా పైసా వసూలు చేయకుండా అర్హులందరికీ ఇల్లు కేటాయిస్తామన్నారు.గత ప్రభుత్వం నాలుగు ఏజెన్సీలకు 35 ప్యాకేజీలను ఇచ్చిందన్నారు.మాజీ మంత్రి నారాయణ 1600లకే కాంట్రాక్ట్‌ ఇచ్చినట్టు అసత్యాలు చెబుతున్నారన్నారు.గత ప్రభుత్వ దోపిడీని ఆధారాలతో ప్రజలు ముందు ఉంచుతున్నామని తెలిపారు.

ఈ అంశంపై చర్చించేందుకు మాజీ మంత్రి నారాయణ ముందుకు రావాలని  సవాల్‌ విసిరారు.నారాయణకు అన్ని లెక్కలను,అగ్రిమెంట్‌ పత్రాలను పంపిస్తామన్నారు.ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని దోచుకున్న డబ్బు ప్రజలకు  తిరిగి చెల్లించాని హితవు పలికారు.300  చదరపు అడుగులు కేటాయించిన ప్లాట్ల లబ్ధిదారుల కోసం విచారణ చేశామని..సగానికి పైగా లబ్ధిదారుల జాడే లేదన్నారు.టీడీపీ నేతలే రూ.500 చెల్లించి బినామీ పేర్లు పెట్టుకున్నారన్నారు.వీటన్నింటినీ మరోసారి విచారించి అర్హత ఉన్నవారికే ఇళ్లు కేటాయిస్తామన్నారు.

దోపిడీ చేసి బాబు,లోకేష్,నారాయణ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు.భారీ కుంభకోణాలు చేశారు కాబట్టే ప్రజలు కోలుకోని విధంగా దెబ్బకొట్టారన్నారు.300 చదరపు అడుగులు ప్లాట్‌ పూర్తి ఉచితమని తెలిపారు.ఇతర ప్లాట్ల ధరలు కూడా తగ్గించాలని చూస్తున్నామని తెలిపారు.ఇళ్ల నిర్మాణ విషయంలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామని వెల్లడించారు.మాకు ఎవరిపైనా కక్షలేదు కానీ..దోపిడీ చేసిన వారిని వదలబోమని తెలిపారు.

 

తాజా వీడియోలు

Back to Top