బీసీ వర్గాల రక్షకుడిగా  వైయ‌స్ జ‌గ‌న్ 

మంత్రి శ్రీ‌నివాస వేణుగోపాల‌కృష్ణ‌

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో బీసీ మంత్రులు సమావేశం 

 తాడేప‌ల్లి: బీసీ వర్గాల రక్షకుడిగా  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సుప‌రిపాల‌న అందిస్తున్నార‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 139 బలహీనవర్గాల కులాల వారికి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, మున్సిపల్‌ కమిషనర్లుగా, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఉపముఖ్యమంత్రులుగా నియమించారు.  ఇవన్నీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో భేటి అయిన బీసీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, శంకరనారాయణ, ఎమ్మెల్సీలు జంగా కృష్టమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి భేటీ అయ్యారు. సమావేశం అనంతరం సీఎం క్యాంప్‌ కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ.

*ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే..:*

ఈ రోజు ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో సమావేశమయ్యాం. రాష్ట్రంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడిన తర్వాత... ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ తాను పాదయాత్రలో పరిశీలించిన బీసీ సమస్యల పరిష్కారానికి కనుకొన్న మార్గాల మీద, బీసీల కోసం నాడు చెప్పిన మాట నేడు ఆచరిస్తూ.. వారి జీవితాల్లో లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆధ్వర్యంలో పాలన సాగుతోంది. ఈ తరుణంలో బీసీలకు జరిగిన మేళ్లు చూస్తే.. బీసీ వర్గాల్లో సుమారు 139 కులాలు ఉంటే... 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆ కార్పొరేషన్లలో ఉన్న ఛైర్మన్లు, డైరెక్టర్లు ప్రత్యేకంగా గతంలో ఎప్పుడూ ప్రభుత్వంలో భాగస్వామ్యులు కానీ కులాల వారికి కూడా ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారు.

దాంతోపాటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కులాల అభ్యున్నతి కోసం... ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడమే ఈ సమావేశం లక్ష్యం. 
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెటింగ్‌ కమిటీలలోనూ, ఆలయ కమిటీలలో ప్రత్యేకమైన రిజర్వరేషన్లు కల్పించాం. ఇలా కార్యక్రమాల్లో భాగస్వామ్యులైన వారి వివరాలను కూడా సేకరించి.. రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని.. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ వల్ల బీసీల రాజ్యాధికార దశ ప్రారంభమైందని వివరించాలని నిర్ణయించాం.  వారిలో ఉన్న ఆత్మన్యూనత్వాన్ని తొలగించి, ఆత్మగౌరవాన్ని పెంపోందించిన నాయకుడుగా జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న కార్యకలాపాలను వారందరికీ వివరించాలని సమావేశంలో నిర్ణయించాం.  
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాలలోనూ ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం. తద్వారా ఆ ప్రాంతీయసదస్సులు నిర్వహణ అనంతరం రాష్ట్ర స్ధాయిలో ఒక సదస్సు నిర్వహించాలనేది కార్యాచరణను నిర్ణయించాం. 

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ సబ్‌ప్లాన్‌లో సుమారు రూ. 31 వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌లో బడ్జెట్‌లో కేటాయించారు. ప్రధానంగా విద్యకు దూరంగా ఉన్న బలహీనవర్గాల్లో పాఠశాలలను నాడు–నేడు కార్యక్రమం ద్వారా బాగుచేయడంతో పాటు గోరుముద్ద, విద్యాకానుక, వసతిదీవెన, విద్యాదీవెన అందిస్తున్నాం. ఏ బలహీనవర్గాల తల్లులైతే పిల్లలను చదివించడానికి ఇబ్బందిపడతున్నారో... వారి కోసం ఈ పథకాల ప్రవేశపెట్టారు. 

బీసీ వర్గాల రక్షకుడిగా  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 139 బలహీనవర్గాల కులాల వారికి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, మున్సిపల్‌ కమిషనర్లుగా, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఉపముఖ్యమంత్రులుగా నియమించారు.  ఇవన్నీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. 

రెండో అంశం.. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ చెప్పినట్లు మార్కెటింగ్‌ కమిటీల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. మార్కెట్‌ కమిటీ మెట్టు ఎక్కనివారికి కూడా ఇవాళ డైరెక్టర్లు, అధ్యక్షులుగా అవకాశం కల్పించారు. అలాగే ఆలయాల్లో ఆలయ కమిటీ డైరెక్టర్లు, ఛైర్మన్లుగా చేసిన తీరు చూస్తే.. బీసీగా, బీసీ సంక్షేమశాఖ మంత్రిగా గర్వపడుతున్నాను.

ఆయన తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల బీసీ సోదరులు అనేకమంది రాజ్యపరిపాలనలో భాగస్వామ్యులయ్యారు. వారి  అవసరాలు ఏమిటన్నది గుర్తించి..ఆరోగ్య సమస్యలు వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా పరిష్కారం, పిల్లలును చదివించాలని వారికి విద్యాదీవన, విద్యాకానుక, అమ్మఒడి పథకాలుతో పాటు పాఠశాలలో మెరుగైన వసతులలో నాడు –నేడు చేపట్టారు.  పాఠశాలలో మంచి నీరు, టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు.

ఆలయాల్లో పనివాళ్లుగా ఉన్న బీసీలు... శిల్పులు, నాయి బ్రాహ్మణులు, రజకులు ఇలాంటి అనేక కులాల వారు ఉన్నారు. వారిని ఆలయ కమిటీ ఛైర్మన్లుగా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. మార్కెటింగ్‌ కమిటీ అనేది రాజకీయ పదవి అయినా.. దానిలో రిజర్వేషన్‌ లేదు. అలాగే మున్సిపల్‌ ఛైర్మన్లు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, మండల అధ్యక్షుల్లో కచ్చితంగా బీసీలకు స్ధానం కల్పించాలని.. ఉప ఛైర్మన్లుగా, ఉపాధ్యక్షులుగా వారిని నియమించారు. ఇవన్నీ చూస్తే.. జగన్మోహన్‌ రెడ్డి గారి పాలనలో బీసీలు ఎంత ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారో అర్ధమవుతుంది. 

అయితే దీన్ని క్షేత్రస్ధాయిలో ఏ విధంగా తీసుకువెళ్లాలి, క్షేత్రస్ధాయిలో ప్రజలకు ఏ విధంగా వివరించాలి అనేదానిమీద చర్చించాం. ఇది మా ఆత్మ గౌరవ రక్షకుడికి మేము మరలా మా ఆత్మగౌరవం రక్షింపబడ్డ తర్వాత.. మా వాళ్లను గొప్పగా జీవించేటట్టు చేసిన æ పరిస్థితులను వివరించడానికి ప్రత్యేకమైన సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించాం. 

ఎమ్మెల్సీ జంగాకృష్ణమూర్తి, నేను కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అక్కడున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్నవారందరినీ ఒక తాటిమీదకు తీసుకొస్తాం.  బీసీల రాజ్యానికి మొదటి అడుగు వేయించినటువంటి జగన్మోహన్‌రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ కార్యక్రమాలు చేయాలని ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 

ఈ సమావేశంలో పాల్గొన్న బీసీమంత్రులందరూ మంచి సూచనలు చేసారు. వీటన్నింటినీ క్రోఢీకరించి.. పార్టీ తరపున ఒక సమన్వయ కమిటీగా ఏర్పాడు చేసుకున్నాం. ఇంకా మంచి సలహాలు, సూచనలు తీసుకెళ్లి బీసీలకు ఈ ప్రభుత్వం వల్ల ఎన్నిమేళ్లు జరిగాయో తెలియజేయాలని నిర్ణయం. సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ చెప్పింది, చేసి చూపించిన మనిషిగా ఈ రాష్ట్రంలో కులవ్యవస్ధలో మగ్గిపోతున్న వారిని, సమాజంలో సమదృష్టితో చూసేటట్టుగా ఎలా తీర్చిదిద్దాలి అన్న ఆయన ఆలోచనకి తగ్గట్టుగా ఆయన చేసినటువంటి ఈ మూడు సంవత్సరాల పాలనలో.. కరోనా కష్టం వచ్చినా కూడా వారికి కష్టం లేకుండా చూసిన తీరుని వారికి వివరించాలని నిర్ణయించాం.  దీనికోసం వచ్చే నెల 15 తేదీ తర్వాత ఒక షెడ్యూల్డ్‌ నిర్ణయించి ఒక నెలరోజుల్లోనే పూర్తిగా రాష్ట్ర స్ధాయి పర్యటనలు చేయాలని నిర్ణయించాం. 
బీసీల స్ధితిగతులని అధ్యయం చేసి, పరిష్కరించినటువంటి ఫలాలను వారికిస్తూ.. మరలా ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే వాటిని తెలుసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి.. భవిష్యత్తులో వారి సమస్యలను పరిష్కరించే మార్గాలను అన్వేషించడానికి అవసరమైన కార్యాచరణ చేయడానికి మేము సమావేశమయ్యాం.
ఈ రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం రూ. 31.64 వేల కోట్లుతో సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి బీసీలందరి తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాను. జిల్లా స్ధాయి సదస్సులు అయిన తర్వాత రాష్ట్రస్ధాయి సదస్సు నిర్వహిస్తాం. ముఖ్యమంత్రిగారు అందులో పాల్గొంటారు. ప్లీనరీ కంటే కచ్చితంగాముందే చేయాలని భావిస్తున్నాం.  మే ఆఖరు లేదా జూన్‌ మొదటి, రెండు వారంలో ఈ రాష్ట్ర స్ధాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించాం. 

ఇప్పటివరకు బీసీల కోసం ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మేలు చేసిన పథకాలను వివరించడమే లక్ష్యం. గతానికి భిన్నంగా బీసీలకు మేలు జరిగిందనే వాస్తవాన్ని బీసీలు కూడా తెలుసుకోలేని కొన్ని కుతంత్రాలు జరుగుతున్నాయి. వాటిని కూడా వివరించాల్సిన అవసరం ఉంది. గతంలో మార్కెటింగ్‌ కమిటీల్లో రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లు ఉన్నా దాన్ని అమలు చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రిగారు చట్టం చేసారు. దీనిని ఎవరూ మార్చలేరు.

56 కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటిని భవిష్యత్తులో ఎవరూ మార్చలేరు. ఇది కచ్చితంగా బీసీలకు పెద్దమేలు. ఇంత పెద్ద సాహసంతో కూడిన నిర్ణయం... దాన్ని ఎవరూ మార్చేలేని విధంగా చట్టం చేశారు. మార్కెట్‌ కమిటీల్లోనూ, దేవాదయ కమిటీల్లో చట్టం చేశారు. దీన్ని వివరించాలి. ఇది మీకు లభించిందంటే అది జగన్మోహన్‌రెడ్డిగారు తీసుకున్న నిర్ణయం అని వాళ్లకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇవాళ రెండువేల నుంచి రెండువేల ఐదువందల మంది బీసీలకే పదవులున్నాయి. వాళ్లందరూ ఒకేచోట కూర్చున్నప్పుడు వారిలో ధైర్యాన్ని నింపాలి. అసలు వాస్తవంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మేలుపై కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. 
ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బీసీలు వారి భవిష్యత్తు జీవితాన్ని ఎలా మల్చుకోవాలి..ఈ పథకాలు ఉపయోగించుకుని ఎలా ఎదగాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. 

 పేదవాడు పేదరికం పై యుద్ధం చేసి దానినుంచి బయటకు రావాలంటే కావాల్సిన శక్తి ధనం.. దాన్ని డీబీటీ ద్వారా ఇచ్చిన పాలకులెవరూ లేరు. సిఫార్సులకు, అవినీతికి, లంచాలకు తావులేకుండా ఇస్తున్న పరిస్థితి. పేదవాడు ఎక్కడున్నా వెదకడానికి వాలంటీర్‌ వ్యవస్ధ వచ్చింది. అర్హత ఉంటే ఎవరినీ అడగకుండానే పథకం వస్తుందనే ఆలోచన వచ్చంది. దీనిలో కోట్లాదిమంది బీసీలు మేలు పొందారు. బీసీలకు ఇంత మేలు జరుగుతుంది.. ఆలయ కమిటీల్లోనూ, కార్పొరేషన్లలోనూ బీసీలకు పదవులు వచ్చాయి. నీకు లభించిన ఈ గౌరవం జగన్మోహన్‌రెడ్డి గారి కష్టం. సమాజంలో బీసీలకు  గుర్తింపు లభించిందంటే దానికి కారణం... జగన్మోహన్‌ రెడ్డిగారి కష్టం వల్ల ఏర్పడ్డ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వలనే. ఆవిషయాన్ని కూడా వారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన మాటను అమలు చేస్తూ.. మరలా లోపాలు ఏవైనా ఉంటే సవరించాలనే ఉద్దేశ్యంతో సీఎం గారు చేసిన సూచన ఇది. 

విద్యుత్‌ ఛార్జీల మీద టీడీపీ ఆందోళనలపై స్పందిస్తూ... వారి పాలనాకాలంలో ఒక్క రూపాయి కూడా పెంచనట్టు వారు మాట్లాడుతున్నారు. రాజశేఖర్‌ రెడ్డి పాలనా కాలంలో ఒక్క రూపాయి పెంచలేదు. చంద్రబాబునాయుడు 25 సార్లు విద్యుత్‌ ధరలు పెంచారు. కేవలం ఎన్టీఆర్‌ గారు ఇచ్చిన రూ.50 హార్స్‌ పవర్‌నే తీసేసి రూ.350 చేశారు. ఇవాళప్రజలను ఏదోలా దృష్టి మరల్చాలని.. అధికారం కోసం తపన, తాపత్రయంతో టీడీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. వారిని ప్రజలకు విశ్వసించే పరిస్థితులు లేవు.  ప్రజలకు వాస్తవాలు తెలుసు. వారికి కష్టం వస్తే.. ఏ ప్రభుత్వం ఆదుకుంటుందో వారికి తెలుసు. దాన్ని దృష్టి మరల్చడం టీడీపీ తరం కాదు అని మంత్రి వేణుగోపాల్‌ స్పష్టం చేశారు.

Back to Top