బీసీలకు నూతనోత్తేజం

వైయ‌స్ జ‌గ‌న్ బీసీ డిక్ల‌రేష‌న్‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా సంబ‌రాలు 

మ‌హానేత విగ్ర‌హాల‌కు పాలాభిషేకం

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన బీసీ డిక్ల‌రేష‌న్‌పై బీసీలకు నూత‌నోత్తేజం క‌లిగింది.   ఏలూరు బీసీ గ‌ర్జ‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన హామీల ప‌ట్ల  పార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకున్నారు. ఈ మేర‌కు సోమ‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా బీసీలు మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌కు పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు  మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధికి వైయ‌స్ఆర్‌ సీపీ కంకణం కట్టుకుందన్నారు.  ఇన్నాళ్లు చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా తమ అధినేత అన్నివర్గాల ప్రజల స్థితిగతులను తెలుసుకున్నారని, బీసీల జీవన ప్రమాణలు పెంచే దిశగా డిక్లరేషన్‌ ప్రకటించారని తెలిపారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగానే వైయ‌స్ఆర్‌సీపీ బీసీ డిక్లరేషన్‌ ఉందన్నారు. పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని జగన్‌ చెప్పారని, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించేలా చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా  గుర్తు చేశారు. దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి హయాంలో అన్నిరకాలుగా బీసీలకు మేలు జరిగిందని తెలిపారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలను ఎవరు నమ్మొద్దని, వచ్చే ఎన్నికల్లో తగిన బద్ధి చెప్పాలని  పిలుపునిచ్చారు.  జగనన్నతోనే బీసీలకు లాభం జరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  
అవనిగడ్డలో..
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీలకు డిక్లరేషన ప్రకటించడంపై అవనిగడ్డ నియోజకవర్గం బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అవనిగడ్డ వంతెన వద్ద సెంటర్‌లో దివంగత నేత వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌, బాబుకడవ కొల్లు నరసింహారావు, రేపల్లి శ్రీనివాస్‌, సింహాద్రి వెంకటేశ్వర్‌ రావు, స్థానిక  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానలు, బీసీ సంఘాల నేతలు, తదితరలు పాల్గొన్నారు. 

నూజివీడులో..
బీసీలకు డిక్లరేషన్‌ ప్రకటించి, వరాలు ప్రకటించడంపై జిల్లా బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నూజివీడు మండలం సుంకొల్లులో దివంగత సీఎం వైయ‌స్ఆర్‌  విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు,  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బీసీ సంఘాల నేతలు, అభిమానలులు తదితరులు పాల్గొన్నారు

పార్వతీపురంలో..
బీసీ గర్జన సభలో వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీల పట్ల పార్వతీపురం బీసీ సంఘాల నేతలు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద దివంగత ప్రజానేత వైయ‌స్ఆర్  విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  నాయకులు, అభిమానులు, ప్రజాసంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. 

కురుపాంలో..
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో బీసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దివంగత నేత వైయ‌స్ఆర్  విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షిత్‌ రాజు పాల్గొన్నారు.

గజపతినగరంలో..
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఏలూరు సభలో బీసీలకు ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేస్తూ దివంగత ప్రజా నాయకుడు వైయ‌స్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీసీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.      

శ్రీ‌శైలం:

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఆధ్వ‌ర్యంలో శ్రీ‌శైలంలో 116 టెంకాయ‌లు కొట్టారు. వైయ‌స్ జ‌గ‌న్‌తోనే బీసీల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు శిల్పా భువ‌నేశ్వ‌ర్‌రెడ్డి, గుండ‌య్య‌యాద‌వ్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Back to Top