పేదల ప్రభుత్వమిది..

నామినేటెడ్‌ పదవుల్లో నిమ్నవర్గాలకు 50 శాతం రిజర్వేషన్‌లు ఇచ్చిన ఘనత జగన్‌దే

చేనేతలను ఆదుకుని.. మాటమీద నిలబడ్డారు

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ

ధర్మవరం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ది పెద్దమనసు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ‘ వైయస్సార్‌ చేనేత నేస్తం’ ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ పేదల మనిషి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడు బాధపడకూడదని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడని చెప్పారు. అనంతపురం జిల్లాలో 19 మార్కెట్‌ యార్డులు ఉంటే 10 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చైర్మన్‌ పదవులు ఇచ్చిన ఘనత జగన్‌దేనని అన్నారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం వరకు నిమ్న వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయం చాలా గొప్పదన్నారు. 2014లో 37 రోజలు పాటు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన రిలే నిరాహారదీక్ష సంఘీభావం తెలిపారని గుర్తు చేసుకున్నారు. 2016 ఫిబ్రవరి 12, 13, 14 మూడు రోజుల పాటు చేనేత దీక్ష చేసి వారి సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత అమలు చేస్తున్న పథకాలు చాలా పేదల అభ్యున్నతికి ఉపయోగపడతాయన్నారు.
కేబినేట్‌లో అణగారిణ వర్గాలకు..
కేబినేట్‌లో బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీకు పెద్దపీట వేశారని చెప్పారు. మహిళల కోసం అనేక కొత్త పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ ప్రకటించిన ఘనత కూడా జగన్‌దేనని అన్నారు. 
 

Back to Top