బీసీలకు చంద్రబాబు చేసిన ద్రోహం ఎండ గడతాం

బీసీ మంత్రులు, పార్టీ బీసీ నాయకులు స్పష్టీకరణ

 బీసీలు అంటే వెనకబడిన వారు కాదు.. వారు బ్యాక్‌బోన్‌

ఈ మూడేళ్లలో వారికి పూర్తి అండదండగా ప్రభుత్వం

అన్నింటా బీసీలకు అగ్రస్థానం. గుర్తింపు. ప్రాతిని«థ్యం

భవిష్యత్తులోనూ బీసీలకు అండగా నిలబడేది వైయస్సార్‌సీపీనే

‘జయహో బీసీ మహాసభ’ ఘనంగా నిర్వహిస్తాం

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియమ్‌లో ఈనెల 7న నిర్వహించనున్న ‘జయహో బీసీ మహాసభ’ ఏర్పాట్లు పరిశీలించిన బీసీ మంత్రులు, వైయస్ఆర్‌ సీపీ బీసీ నాయకులు 

విజయవాడ: బీసీలకు చంద్రబాబు చేసిన ద్రోహం జ‌య‌హో బీసీ మ‌హాస‌భ‌లో ఎండ గడతామ‌ని బీసీ మంత్రులు,  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ బీసీ నాయకులు స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియమ్‌లో ఈనెల 7న నిర్వహించనున్న ‘జయహో బీసీ మహాసభ–వెనకబడిన కులాలే వెన్నుముక’ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి) బూడి ముత్యాలనాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఐ అండ్‌ పీఆర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైయస్సార్‌సీపీ బీసీ సెల్‌ నాయకుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, నవరత్నాలు వైస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తితో పాటు, పార్టీకి చెందిన పలువురు బీసీ నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి  మాట్లాడారు.

చరిత్రలో లేని విధంగా..:
    చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘జయహో బీసీ మహాసభ – వెనుకబడిన కులాలే వెన్నుముక’ కార్యక్రమం జరుగుతుంది. ప్రజా జీవితంలో మమేకమవుతూ పరిపాలనలో మొదటి అడుగు వేసే వార్డు మెంబర్‌ నుంచి పరిపాలనా నిర్ణయం చేసే రాజ్యసభ సభ్యుడు వరకు.. ఇంకా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులుతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లు, స్థానిక సంస్థల ప్రతినిధులు.. సుమారు 82 వేల మంది బీసీ నాయకులు, ప్రతినిధులతో సదస్సు నిర్వహించబోతున్నాం.
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ బీసీల పట్ల ప్రేమతో తీసుకున్న పరిపాలనా నిర్ణయాల అమలును ప్రత్యక్షంగా ప్రజలకు చేరువ చేస్తున్న బీసీ నాయకులంతా ఒక చోట చేరే మహాసభగా దీన్ని చూడాలి. రాజకీయంగా ఎదుగుతున్న బీసీ కులాల నాయకులు ఎవరికి వారు తమ సామాజిక వర్గానికి దశ దిశా నిర్దేశం చేసుకునేందుకు ఈ జయహో బీసీ మహాసభ ఉపయోగపడుతుంది. 

చేసినవన్నీ చెబుతాం. వాటినీ గుర్తు చేస్తాం:
    ఈ మూడున్నరేళ్ల పాలనలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ బీసీలను ఏ స్థాయిలో అక్కున చేర్చుకుని వారికి సంక్షేమ పథకాలు అందజేశారనేది బీసీ నాయకులుగా మేమంతా బలంగా వినిపిస్తాం. అలాగే బీసీలను మోసపూరిత మాటలతో ముంచేసిన చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల్ని గతంలో ఎలా చిత్తుచేశామనేది గుర్తు చేస్తాం.
    అదే విధంగా బీసీల వెన్నుముకగా అండనిచ్చిన జగనన్న నాయకత్వాన్ని కాపాడుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనేది మా సామాజికవర్గాలకు వివరిస్తాము. బీసీలకు సంబంధించి చంద్రబాబు మోసపూరిత మాటలను ఎండ గడతాం. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీని చిత్తుగా ఓడించే దిశలో అడుగులు వేసేందుకు తీర్మానాలు చేస్తాం. 
    ప్రతిష్టాత్మక జయహో బీసీ మహాసభ వేదికపై సీఎంగారి పాలన గురించి వివరించడానికి రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో ఉన్న 185 మంది బీసీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. వారంతా ఆ సభలో సీఎంగారి పక్కన కూర్చొని.. ఆయా సామాజికవర్గాల్లో ఉత్సాహం నింపి.. జగనన్న పాలనలో ఆయన తన కోసం తాను కాదు.. ముందు తరాల భవిత కోసం పని చేస్తున్నారంటూ తమ గళం వినిపించనున్నారు.  

175కు 175 సాధించేలా..:
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ బీసీలకు ఇచ్చిన శక్తిని చాటుతూ, బీసీలు సగర్వంగా తలెత్తుకుని ఉండేలా 2024లో తిరిగి వైఎస్‌ఆర్‌సీపీకి భారీ మెజార్టీ.. 175 స్థానాలుకు 175 కట్టబెట్టేలా మా బీసీ కులాల్ని సమాయత్తం చేసేందుకు పూనుకుంటాము. 7వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.. జరగనున్న ఈ మహాసభకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బీసీ సోదర నేతలకు అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు మంచి భోజన సదుపాయం కల్పించాం. వేలాదిగా బీసీలు తరలివచ్చి ‘జయహో బీసీ మహాసభ’ను విజయవంతం చేయాలని కోరుతున్నాం.

తాజా వీడియోలు

Back to Top