గౌతమ్ రెడ్డి మృతికి బీసీ మంత్రి సంతాపం

విజ‌య‌వాడ‌:  రాష్ట్ర పరిశ్రమలు,వాణిధ్య, ఐటీ శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి అకాల మరణం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,రాష్ట్ర కళింగకార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్ తో పాటు బీసీకార్పొరేషన్ ఛైర్మన్ లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడ గొల్లపూడిబీసీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి వైయ‌స్ఆర్‌సీ పార్టీ స్థాపించిన నుంచి పార్టీ అభివృద్ధికి నిరంతరం పాటుపడటంతో పాటు ఐటీ శాఖామంత్రి గా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, నిరుద్యోగులకు ఉపాదికల్పనకు,రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషిచేసారని పలువురు గౌతమ్ రెడ్డి సేవలను కొనియాడారు.ఈసందర్భంగా గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈకార్యక్రమంలో బీసీశాఖామంత్రితో పాటు రాష్ట్ర కళింగకార్పొరేషన్ చైర్మన్ శ్రీ పేరాడ తిలక్,కాపుకార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్,కళింగ కోమటి చైర్మన్ అందవరపు సూరిబాబు, కార్పొరేషన్ చైర్మన్లు ,లోకేశ్వరరెడ్డి,రాజాపు హైమావతి, చీపురు రాణి తదితరులున్నారు.

Back to Top