బీసీ నేత‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ భేటి

బీసీ అధ్యాయ‌న క‌మిటీపై చర్చ

హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీకి చెందిన బీసీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో సోమ‌వారం పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో స‌మావేశ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ బీసీ అధ్యాయ‌న క‌మిటీపై చ‌ర్చించారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీల‌ను ఐదేళ్ల‌లో ఎలా మోసం చేసిందో స‌మీక్షించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఏం చేస్తోందో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని, చంద్ర‌బాబు విధానాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని అధినేత పార్టీ నాయ‌కుల‌కు సూచించారు.

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్ర‌తి కులానికి ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి  ఆర్థికంగా చేయూత‌నందించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ ఇదివ‌ర‌కే నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే బీసీల‌కు ఇంకా ఏం చేయాల‌నే అంశంపై  ఇప్ప‌టికే బీసీ అధ్యాయ‌న క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టించి బీసీల స్థితిగ‌తుల‌పై అధ్యాయ‌నం చేసింది. ఈ నివేదిక‌ను అధినేత‌కు అంద‌జేశారు. అధ్యాయ‌న క‌మిటీ ద్వారా వెలుగు చూసిన విష‌యాల‌పై పార్టీ నేత‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు. త్వ‌ర‌లోనే పెద్ద ఎత్తున బీసీ గ‌ర్జ‌న కార్య‌క్ర‌మం త‌ల‌పెట్ట‌నున్నారు. ఈ స‌మావేశంలో పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, పార్థ‌సార‌ధి, జంగా కృష్ణ‌మూర్తి, జోగి ర‌మేష్‌, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ త‌దిత‌రులు

Back to Top