చంద్రబాబు బీసీ వ్యతిరేకి

బీసీ న్యాయమూర్తులను అణగదొక్కిన చరిత్ర బాబుది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి

విశాఖపట్నం: చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని, ఓట్లకు బీసీలను వాడుకుంటున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు కపట ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. విశాఖలో జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ..

బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ. 10 వేల కోట్లు అంటూ మోసం చేశారన్నారు. బీసీల అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. బీసీ న్యాయమూర్తులను అగణదొక్కిన నీచమైన చరిత్ర చంద్రబాబుదన్నారు. గ్రామాల్లో బీసీలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ నెల 17న ఏలూరులో వైయస్‌ఆర్‌ సీపీ బీసీ గర్జన నిర్వహించనున్నామన్నారు. గర్జనలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని బీసీల సంక్షేమానికి చేపట్టబోయే కార్యక్రమాలను ప్రకటిస్తారన్నారు.

Back to Top