నంద్యాల: నాడు వీరబ్రహ్మంద్రస్వామి బనగానపల్లెలో కాలజ్ఞానం రాసినప్పుడు ఏ విధంగా ఆయన చెప్పింది నిజమైందో అదే విధంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్నీ నిజమయ్యాయని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా బనగానపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే, లబ్ధిదారులు మాట్లాడారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏమన్నారంటే.. నమస్కారం, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బనగానపల్లె ప్రజలకు ఈ రోజు పండుగ రోజు, అన్నా నాడు వీరబ్రహ్మంద్రస్వామి బనగానపల్లెలో కాలజ్ఞానం రాసినప్పుడు ఏ విధంగా ఆయన చెప్పింది నిజమైందో అదే విధంగా సీఎంగారు ఇచ్చిన హామీలు అన్నీ నిజమయ్యాయి. ఈ ఏడాది వర్షాలు తగ్గినా రైతులకు ఇబ్బంది లేకుండా గోరకల్లు రిజర్వాయర్ నింపి రైతులను ఆదుకున్న చరిత్ర సీఎంగారిది, అదే విధంగా ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని, బనగానపల్లెలో 4 లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ ఇలా అన్నీ ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం, సీఎంగారి సహకారంతో ప్రతీ పల్లెకు రోడ్డు, ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటుచేశాం, ఇక్కడ టీడీపీ నాయకుడు బీసీ జనార్ధన్ రెడ్డి ఇళ్ళ పట్టాలు అడ్డుకుని రాకుండా చేశారు, మనం మళ్ళీ అధికారంలోకి రాగానే వారందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాలి, ఇక్కడ నాపరాతి గనుల్లో పనిచేస్తున్న పేదల బతుకులు మారేలా మళ్ళీ మన ప్రభుత్వం రాగానే గనులకు రాయల్టీ తగ్గిస్తే వారికి ఉపాధి దొరుకుతుంది, స్ధానికంగా ఉన్న నీటి సమస్యను తీర్చేలా నిధలు, పథకాలు మంజూరు చేయాలని కోరుతున్నాను. ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేయడం వల్ల ఈ ప్రాంత వాసులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంది, ఇప్పటివరకు ఏ ప్రమాదం జరిగినా కర్నూలు వెళ్ళాల్సివచ్చేది, కానీ ఇప్పుడు ఇక్కడే ఏర్పాటుచేశారు, థ్యాంక్యూ. మా పేద ఆర్యవైశ్యులను గుర్తించి సాయం చేశారు: పద్మావతమ్మ, లబ్ధిదారు, బనగానపల్లె అందరికీ నమస్కారం, అన్నా మేం ఆర్యవైశ్యులం, మా ఓసీలలో మమ్మల్ని గుర్తించి పథకం అందించడం చాలా సంతోషంగా ఉంది, నా భర్త చనిపోయారు, ఈ సమయంలో ఈ పథకం ఇవ్వడం నాకు చాలా ఉపయోగపడింది, నాకు 45 ఏళ్ళు రాగానే వలంటీర్ వచ్చి ఈ పథకం గురించి చెప్పాడు, సచివాలయంలో ఈబీసీ నేస్తం పథకం అర్హురాలైనట్లు చెప్పగానే సంతోషమేసింది, నేను రెండేళ్ళుగా రూ. 30 వేలు తీసుకున్నాను, ఈ డబ్బు నా అనారోగ్య సమయంలో చాలా ఉపయోగపడింది, మీరు మా ఓసీలకు ఇస్తామని చెప్పకుండా సాయం చేస్తున్నారు, నాకు వితంతు ఫించన్ కూడా వస్తుంది, ఒకటో తేదీ వచ్చిందంటే చాలు వలంటీర్ వచ్చి ఇస్తున్నాడు, ప్రజల వద్దకే పాలన అంటే ఇదే, నాకు జగనన్న చేదోడు సాయం కూడా వచ్చింది, నాకు వచ్చిన డబ్బుతో కుట్టుమిషన్‌లు కొన్నాను, ఇంకా ఇద్దరికి ఉపాధి కల్పించాను, మీరు నేనున్నానంటూ సాయం చేస్తున్నారు, మా ఆర్యవైశ్యులను మీరు గుర్తించి సాయం చేశారు, ధన్యవాదాలు.