వైయ‌స్ఆర్‌ ఆసరాతో పేదింట వెలుగులు 

బ‌ద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్ సుధా

బి. కోడూరు మండలంలో వైయ‌స్ఆర్ ఆస‌రా సంబ‌రాలు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్‌ ఆసరాతో పొదుపు మహిళలకు బాసటగా నిలిచి పేదింట వెలుగులు నింపిన ఏకైక సీఎం మన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని  బ‌ద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అన్నారు. బి. కోడూరు మండలంలో గురువారం నిర్వ‌హించిన వైయ‌స్ఆర్‌ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు పొదుపు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి మోసం చేశారని చెప్పారు. అందువల్లే మహిళల ఆశీర్వాదం జగనన్నకే ఉందన్నారు. బాబుకు ఎన్ని కల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికలు పేదలు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్నట్లు తెలిపారు. పేదలు సీఎం వైయ‌స్ జగన్‌ పక్షాన ఉంటే.. పెత్తందార్లు చంద్రబాబు పక్షాన ఉన్నారని తెలిపారు. నా ద్వారా మేలు జరిగి ఉంటేనే ఓటు వేయ మని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుతుంటే బాబు మాత్రం డబ్బులిచ్చి ఓట్లు కొనాలని వస్తున్నారని చెప్పారు.  అనంత‌రం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్ర‌ప‌టానికి డ్వాక్రా మ‌హిళ‌ల‌తో క‌లిసి ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధా పాలాభిషేకం చేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ నాయ‌కులు ఆదిత్య రెడ్డి , జడ్పిటిసి దావీదు, ఎంపీపీ కోడూరు చెన్నమ్మ, మాజీ జెడ్పిటిసి రామకృష్ణారెడ్డి , యోగానంద రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, డిసి యువసేన అధ్యక్షులు చాపాటి సాయి నారాయణ రెడ్డి ,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top