టీడీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. వైయ‌స్ఆర్ సీపీదే విజ‌యం

బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ డీసీ గోవింద‌రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో తెలుగుదేశం పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిదే విజ‌య‌మ‌ని మాజీ ఎమ్మెల్సీ, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డీసీ గోవింద‌రెడ్డి అన్నారు. బద్వేలు ఉప ఎన్నికలో అనేక పోలింగ్ బూతుల్లో బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నార‌న్నారు. సిట్టింగ్ అభ్యర్థి మరణించినట్టైతే, వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న పక్షంలో పోటీ పెట్టం అన్న టీడీపీ ప్రకటన పచ్చి అబద్ధం అని స్పష్టమైంద‌ని డీసీ గోవింద‌రెడ్డి మండిప‌డ్డారు. సిట్టింగ్ దళిత శాసనసభ్యుడి పట్ల గౌరవం చూపుతున్నామన్న చంద్రబాబు ప్రకటన కూడా పచ్చి మోసం.. దళితుల పట్ల బాబు కపట ప్రేమ మరోసారి రుజువైంద‌న్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్ర‌లు చేసినా ఉప ఎన్నికలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభ్యర్థి డాక్ట‌ర్ సుధ ఘన విజయం సాధిస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top