బ‌ద్వేలు ఉప ఎన్నిక ప్ర‌చారంలో దూసుకెళ్తున్న డాక్ట‌ర్ సుధ

వైయ‌స్ఆర్ జిల్లా:  బద్వేలు ఉపఎన్నిక ప్ర‌చారంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ దూసుకెళ్తున్నారు.  ఉప ఎన్నిక  ప్రచారంలో భాగంగా  బద్వేల్ మున్సిపాలిటీలోని 35, 1, 5, 6,7,8, 33, 34 వార్డులలో నియోజ‌క‌వర్గ ఇన్‌చార్జ్ డీసీ గోవిందరెడ్డి  ఆధ్వర్యంలో సుధ ఇంటింటా ప‌ర్య‌టించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల‌ని అభ్య‌ర్థించారు. ప్ర‌తి ఇంటి వ‌ద్ద సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ..సంక్షేమ ప‌థ‌కాలు అందాయా అని ఆరా తీస్తూ ప్ర‌చారంలో ముందుకు వెళ్తున్నారు. ఏ వీధికి వెళ్లినా ప్ర‌జ‌లు డాక్ట‌ర్ సుధ‌కు అపూర్వ స్వాగతం ప‌లుకుతూ..త‌మ ఓటు ఫ్యాన్ గుర్తుకే అంటూ నిన‌దిస్తున్నారు.   ఎన్నిక‌ల ప్ర‌చారంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, బ‌ద్వేల్  టౌన్  ఇన్చార్జి, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి , ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి , ఆప్కాస్ చైర్‌ప‌ర్స‌న్‌ ఝాన్సీ,  సగర్ కార్పొరేషన్ చైర్‌ప‌ర్స‌న్ గానుగపెంట రమణమ్మ, శీనయ్య , అడా చైర్మన్ గురుమోహన్,  మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి,  డాక్టర్ శశికళ రెడ్డి,. ఎపి సివిల్ సప్లై డైరెక్టర్ సుందరామిరెడ్డి ,మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, సింగ సాని శివయ్య, బిజ్జం రమణ,   కౌన్సిలర్ రత్నమ్మ, అవుల శివ  కుమారి, బిజ్జాం రాజేశ్వరి, గానుగపేంట సమత,  ఉమా .రమేష్ బాబు,  రామణ బోయిన శీనువాసులు, అనిల్, ష‌ఫీ, డాక్టర్ల్ సత్య శ్రీనివాస్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top