చంద్రబాబూ.. దిగజారుడు రాజకీయాలు మానుకో...

విదేశీపర్యటనల పేరుతో దుబారా చేసిందెవరు..?

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి..

అనంతపురం:ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయని ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాలరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా గర్హించారు. అనంతపురంలో మీడియా సమావేశంలో మాట్లుడిన వెన్నుపూస బాబు వైఖరిపై మండిపడ్డారు. జగన్‌ లండన్‌లో చదువుతున్న కూతురి వద్దకు వెళ్ళితే దాన్నికూడా రాజకీయం చేయడం ఎంతవరుకు సమంజసమని ప్రశ్నించారు.నాలుగేళ్లు పెట్టుబడుల పేరుతో దేశంలో ఏ ముఖ్యమంత్రి వెళ్లని విధంగా నెలకు నాలుగు సార్లు సింగపూర్, దుబాయ్,మలేషియా,అబుదాబీ,అమెరికా తదితర దేశాలకు వెళ్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందెవరని ప్రశ్నించారు.రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో రూ.10 లక్షల కోట్లు కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంది మీరు కాదా? అన్నారు.రాజకీయాల్లోకి రాకముందు చంద్రబాబు ఆస్తి ఎకరా 60 సెంట్లు ఉండేదని,ఈ రోజు ప్రపంచ కోటేశ్వరుల జాబితాలో ఆయన పేరు ఉందని, అంటే ఏస్థాయిలో అవినీతి సొమ్ము సంపాదించాడో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పార్టీ నుంచి విడిపోయి ఆ మకిలిని మా అధినేతపై పెడతారా అని ప్రశ్నించారు. 

Back to Top