చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకో...

కొత్త డ్రామాలను ప్రజలు నమ్మరు..

అరవై రోజుల్లో దోపిడీ పాలన అంతం కాబోతుంది..

మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి..

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు..

విజయవాడ: సంపూర్ణంగా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానన్న  టీడీపీ ప్రభుత్వం ఎందుకు  చేయలేకపోయిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు ప్రశ్నించారు.విజయవాడలోని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.రుణమాఫీ, బ్యాంకుల్లో ఉన్న అక్కాచెల్లెమ్మల బంగారాన్ని విడిపిస్తానని చెప్పిన చంద్రబాబు ఓట్లు వేయించుకుని దగా చేశారని మండిపడ్డారు.  చంద్రబాబు మాటలను నమ్మిన  మహిళలు.. మేలు చేస్తాడని ఎంతో ఆశపడ్డారన్నారు. వారిని అప్పుల్లోకి నెట్టి.. మళ్లీ ఎన్నికల సమయంలో మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. రుణాలు మాఫీ అవుతాయని ఆశించి మహిళలు భంగపడ్డారన్నారు.

వైయస్‌ఆర్‌ హయాంలో డ్వాక్రా మహిళలకు ఆర్థికపరిపుష్టి కలిగిందన్నారు. వైయస్‌ఆర్‌ సర్ణయుగంలో మహిళలు ఆత్మగౌరవంతో జీవించారన్నారు. భర్త లేని ఆడపడుచులకు ఆర్థికస్వాలంబన కలిగించారన్నారు. వైయస్‌ఆర్‌ డ్వాక్రా స్ఫూర్తిని.. టీడీపీ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు.ప్రజలకు తన సొంత సొమ్మును ఇస్తున్నట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చే 10వేల రూపాయలకు స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. పెట్టుబడి నిధి కింద ఇస్తున్నారా, పసుపు–కుంకమ కింద ఇస్తాన్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ జీవోలో  పెట్టుబడి నిధి కింద చూపిస్తోందన్నారు. మహిళలకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌ ఇచ్చి మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే చంద్రబాబు ఇచ్చిన చెక్‌ చెల్లుతుందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు దుష్టపరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం దోపిడీ పరిపాలన మరో అరవై రోజుల్లో అంతం కాబోతుందన్నారు.  చింతమనేని ప్రభాకర్‌ వంటి వీధి రౌడిని చంద్రబాబు విప్‌గా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పదేపదే ప్రభుత్వ అధికారులపై దాడి చేసి  ప్రజాస్వామ్య విలువలకు పాతరేసిన చింతమనేని..  నిన్న వృద్ధుడిని దుర్భాలాడటం దారుణమన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో పేదలందరికి సంక్షేమ పథకాలు డోర్‌ డెలివరీ అవుతాయన్నారు. పార్టీలు,కుల,మత,ప్రాంతాలకు అతీతంగా సంతృప్తిస్థాయిలో పథకాలు అందించిన మహానీయుడు స్వర్గీయ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని కొనియాడారు. దోచుకున్న ఇసుక సొమ్ముతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు.

ప్రజలకు ఇస్తున్న సొమ్ము..నారావారి పల్లె నుంచి వచ్చే డబ్బులు కాదని..ప్రజల కట్టే పన్నులన్నారు. . పరిపాలన అంటే సామాజిక న్యాయం అని,  పేదల కష్టాలను తీర్చడమన్నారు.  నిన్న మంత్రి పరిటాల సునీతపై చెప్పులు,చీపుర్లు ఎందుకు పడ్డాయో చంద్రబాబు గ్రహించాలన్నారు. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మహిళాలోకం ఎందుకంత ఆగ్రహంగా ఉందో తెలుసుకోవాలన్నారు. ధైర్యం ఉంటే చంద్రబాబు దాచిపెట్టిన నల్లధనాన్ని తక్షణమే ప్రజలకు పంచాలన్నారు. చంద్రబాబుకు,టీడీపీ నేతలకు దోచుకోవడం అలవాటు అయిపోయిందని ధ్వజమెత్తారు. పేదల పట్ల టీడీపీ మంత్రులు చులకన భావంతో మాట్లాడుతున్నారని నోరు అదుపులో పెట్టుకోవాన్నారు. ఆంధ్రరాష్ట్రం మొత్తం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన నిలబడివుందన్నారు. ప్రజలు వైయస్‌ జగన్‌ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఓట్లు తొలగిస్తున్నారని వైయస్‌ జగన్‌  ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే చంద్రబాబుకు కోపం వస్తుందన్నారు. దొంగను పట్టుకుని నువ్వు దొంగ అంటే కోపమొస్తుందని ఎద్దేవా చేశారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. చంద్రబాబు దొంగతనం బట్టబయలుచేశారని, చంద్రబాబు నిజ స్వరూపాన్ని దేశానికి చూపించారన్నారు. ప్రజలను దోచుకుతింటున్న చంద్రబాబు..వైయస్‌ఆర్‌సీపీని సైకోపార్టీ అంటూ వ్యాఖ్యల పట్ల ఖండించారు. 

Back to Top